Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్ లో మద్దతు పై కమ్మ సంఘాల కీలక నిర్ణయం- ఏ వర్గం ఎటు వైపు..!?

జూబ్లీహిల్స్ పోరులో కీలక పరిణామం. సామాజిక సమీకరణాలే ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. దీంతో.. పార్టీలు వర్గాల వారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో కమ్మ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అటు బీఆర్ఎస్ కమ్మ వర్గాని కే సీటు ఇవ్వటంతో.. వారి మద్దతు పైన ఆశలు పెట్టుకున్నాయి. మైనార్టీ ఓటింగ్ కీలకంగా మారు తోంది. బీజేపీ నియోజకవర్గంలో కొత్త లెక్కలను తెర మీదకు తీసుకొస్తోంది. అసలు జూబ్లీహిల్స్ లో ఏ వర్గం ఎటువైపు ఉంది.. ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సామాజిక సమీకరణం
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సామాజికవర్గాల లెక్కలు ఇక్కడ కీలకంగా మారాయి. దీంతో, మూడు పార్టీలు కులాల వారీగా ఆకర్షించి, గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. ఎన్నికల వేళ కార్తిక మాసం కూడా రావడంతో కులాల వారీగా పసందైన విందులకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు.

Kamma Community leaders meets CM Revanth over support in Jubilee hills by poll

ఎవరి మద్దతు ఎవరికి
ఇక, కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఉండగా.. అందులో మాదిగ 15,693; మాల 12657 ఓట్లు ఉన్నాయి. రెడ్డి 17,641, లంబాడీ 11364, క్రైస్తవులు 19,396 మంది ఓటర్లున్నారు. ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. వార్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్‌చార్జిలుగా నియమించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తుల చేస్తున్నారు. మాగంటి సునీత కు బీఆర్ఎస్ సీటు కేటాయించింది. కమ్మ వర్గానికి చెందిన వారు కావటంతో సునీతకు ఆ వర్గం ఓట్ల మద్దతు పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్‌, ఇతరులను రంగం లోకి దించి సమావేశాలు జరుపుతోంది. అటు కాంగ్రెస్ కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్‌ అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు.

కమ్మ నేతల హామీ
ఇదే సమయంలో కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. తమ మద్దతు కాంగ్రెస్ కే ఉంటుందని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ ను కోరగా.. సానుకూలంగా స్పందించారు. అమీర్ పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పైన సీఎం ను కోరగా..అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తన సామాజికవర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ ఆ ఓట్లను గండికొట్టేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ తరఫున లంకెల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్‌రెడ్డి దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ కులాల వారీగా తమ నేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరుపుతోంది. దీంతో.. ఈ సమీకరణాలతో తుది గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+