తొక్కిపెడుతున్నారు: రోహిత్ తల్లితో కలిసి హెచ్‌సీయూకు కన్నయ్య, ఉద్రిక్తత
హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధికతో కలిసి జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్నయ్య కుమార్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. దీంతో హెచ్‌సీయూ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కన్నయ్యకు వ్యతిరేకంగా కొంత మంది విద్యార్ధులు నినాదాలు చేయగా, ఏబీవీపీ విద్యార్ధి సంఘం నేతలు మాత్రం వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వర్సిటీలోకి కన్నయ్య, రోహిత్ తల్లితో పాటు సోదరుడిని లోపలికి అనుమతించారని విద్యార్ధి సంఘాలు చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతక ముందు రోహిత్ వేముల తల్లి రాధికను కన్నయ్య కుమార్ పరామర్శించాడు.

నగరంలోని సీఆర్ ఫౌండేషన్‌లో ఆమెను పరామర్శించిన కన్నయ్య రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కన్నయ్యకుమార్ హెచ్‌సీయూకు రానున్నాడనే సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వర్శిటీలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
కన్నయ్యకు హెచ్‌సీయూలోకి ప్రవేశం లేదని వీసీ అప్పారావు సర్క్యులేషన్ జారీచేసిన నేపథ్యంలో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. కన్నయ్య కుమార్ ఉన్న వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది హెచ్‌సీయూ గేటు వద్దే అడ్డుకున్నారు. కన్నయ్య కుమార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనే లోపలికి వదిలే ప్రసక్తే లేదన్నారు.
కన్నయ్యను లోపలికి అనుమతించకుంటే వర్శిటీ గేటు వద్దే సభ నిర్వహిస్తామని ఏఎస్ఏ పేర్కొంది. కన్నయ్య వాహనం చుట్టూ రక్షణ వలయంగా మద్దతుదారులు నిల్చున్నారు. దీంతో వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ఈ క్రమంలోహెచ్‌సీయూ గేటు వద్దే మీడియాతో కన్నయ్య కుమార్ మాట్లాడారు.
రోహిత్ చట్టం తెచ్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సామాజిక న్యాయం జరిగే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాఠీ ఛార్జి, అణిచివేతతో మా గొంతు నొక్కలేరని కన్నయ్య కుమార్ ధ్వజమెత్తారు.
హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కలలను సాకారం చేద్దామని అన్నారు. లోక్ తంత్ర్ జిందాబాత్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్ధుల గళాన్ని ప్రభుత్వం వినకుండా తొక్కిపెడుతుందని మండిపడ్డారు. తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు.
ఇంకా ఎంతమంది రోహిత్‌లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్, యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు.
హెచ్‌సీయూలో లాఠీచార్జిని ఖండిస్తున్నాం: ప్రొఫెసర్ కోదండరాం
హెచ్‌సీయూలో పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యూనివర్శిటీలోకి పోలీసులు ప్రవేశించరాదని అన్నారు. పోలీసులను వెంటనే తక్షణం బయటకు పంపాలని డిమాండ్ చేశారు.
కన్నయ్య పర్యటనలో వర్సిటీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీ జేఏసీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జేఏసీలోకి కొందరు వెళ్లడం వారి వ్యక్తిగతమని, టీ జేఏసీ కొనసాగుతుందని, త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. టీ జేఏసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications