'జీవితంలో గెలుపేలేదు, నా కుటుంబాన్ని ఆదుకోండి': క్లాస్‌రూమ్‌లోనే టీచర్ ఆత్మహత్య

కరీంనగర్: జీవితంలో గెలుపు దక్కలేదు. ప్రతి విషయంలో ఓటమి ఎదురైందంటూ ఓ లేఖ రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధుసూధన్ రెడ్డి తాను పనిచేస్తున్న స్కూల్ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకొన్నాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్‌కు తన సూసైడ్ లెటర్‌లో కోరారు మధుసూధన్ రెడ్డి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

కరీంనగర్ మండలం బొమ్మకల్ గుంటూరు పల్లెలో మధుసూధన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.మధుసూధన్ రెడ్డి శుక్రవారం నాడు స్కూల్‌కు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయితే కుటుంబసభ్యులు వెతికితే స్కూల్ ఆవరణలోనే మధుసూధన్ రెడ్డి స్కూటర్ కన్పిస్తే క్లాస్ రూమ్‌ల్లో వెతికితే ఓ క్లాస్ రూమ్ లో ఆయన ఉరేసుకొని ఉండడాన్ని గుర్తించారు.

మధుసూదన్‌రెడ్డి పెద్ద కొడుకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తితో మధుసూదన్‌రెడ్డి పాఠశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తన జీవితంలో గెలుపు లేకుండా పోయింది, ప్రతి విషయంలో ఓటమినే ఎదుర్కొన్నానని మధుసూధన్ రెడ్డి సూసైడ్ లెటర్ రాసి పెట్టారు.తన కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. ఇదే తన చివరి కోరిక అంటూ ఆ లేఖలో సీఎంను కోరారు మధుసూధన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+