Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్: కేసు నమోదు

హైదరాబాద్: ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ (kasani gnaneshwar) శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో అసంతృప్తి చెందిన కాసాని జ్ఞానేశ్వర్.. అక్టోబర్ 30వ తేదీన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆరోజు ఎన్టీఆర్ భవన్‌​లో పార్టీ నేతలతో సమావేశమైన కాసాని.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పగా.. అందుకు శ్రేణులు పోటీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి గురైన కాసాని.. వెంటనే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

 Kasani Gnaneshwar Joins BRS Party on the presence of kcr

అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి కచ్చితంగా పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ గతంలో వెల్లడించారు. దానికి అనుగుణంగానే తొలి విడత సన్నాహాల్లో 87 మంది అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో రూపకల్పన కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీ, పార్టీలో ఉండటం ఎందుకని ఆయన రాజీనామా చేశారు.

కాసాని జ్ఞానేశ్వర్‌​పై బంజారాహిల్స్​ పీఎస్‌​లో కేసు నమోదు

ఇది ఇలావుండగా, కాసాని జ్ఞానేశ్వర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కాసాని తనను అడ్డుకొని దాడి చేశారని.. గుడి మల్కాపూర్‌​కు చెందిన గోషామహల్ టీడీపీ సమన్వయకర్త డాక్టర్ ఏఎస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల పార్టీ కార్యాలయం నుంచి పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో.. అక్కడకు వెళ్లానట్లు బాధితుడు పేర్కొన్నారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్ ముదిరాజ్, రవీంద్రాచారి, భిక్షపతి ముదిరాజ్, ఐలయ్య యాదవ్, బంటు వెంకటేశం, ప్రశాంత్ యాదవ్ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో ఏఎస్ రావు చెప్పారు. ఈ దాడిలో తన కుడి కంటిపై గాయమైందని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ 29వ తేదీన పార్టీ కార్యాలయానికి వచ్చి డాక్టర్ ఏఎస్.రావు అమర్యాదగా ప్రవర్తిస్తూ.. హల్​చల్​ చేశారంటూ గోషామహల్ ఇం​ఛార్జి ప్రశాంత్​ యాదవ్ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో, వీరిరువురి పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+