కేసీఆర్ పార్టీలో కట్టప్పలు రెడీగా ఉన్నారు: సినిమా ముందుందంటూ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు.

కేసీఆర్ పగటి కలలంటూ లక్ష్మణ్ విమర్శలు

కేసీఆర్ పగటి కలలంటూ లక్ష్మణ్ విమర్శలు

రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నేతలకు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.

టీఆర్ఎస్‌లో కట్టప్పలు రెడీ: సినిమా ముందుందంటూ లక్ష్మణ్

టీఆర్ఎస్‌లో కట్టప్పలు రెడీ: సినిమా ముందుందంటూ లక్ష్మణ్

ప్రదాని మోడీని ప్రశ్నించే స్థాయి సీఎం కేసీఆర్‌కు లేదన్నారు లక్ష్మణ్. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెబుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, టీఆర్ఎస్ కట్టప్పల విషయంలో బీజేపీది ప్రేక్షక పాత్ర మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక ట్రైలర్ మాత్రమేనని, సినిమా ముందుందని అన్నారు.

కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన బండి సంజయ్

కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన బండి సంజయ్

రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని బహిరంగ లేఖలో గుర్తు చేశారు. 2018 నవంబర్‌ 23న మహబూబాబాద్‌ బహిరంగసభలో అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని బహిరంగలేఖలో ప్రస్తావించారు.

అలా చేస్తే మేమే కేసీఆర్‌కు కుర్చీ వేస్తామంటూ బండి సంజయ్

అలా చేస్తే మేమే కేసీఆర్‌కు కుర్చీ వేస్తామంటూ బండి సంజయ్

కుర్చీవేసుకుని గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమైతే.. బీజేపీ తెలంగాణ శాఖ, గిరిజనులు, ఆదివాసీలు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కుర్చీవేసుకుని పట్టాలు ఇప్పించకపోయినా ఫర్వాలేదు కానీ.. కనీసం జులై 15 నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలని అన్నారు. పోడు భూములు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసహరించుకోవాలన్నారు. గిరిజనులు, ఆదివాసీలను పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు వేధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+