కేసీఆర్‌ను కలిసిన ఎంపీ కవిత: నవ్వుతూ ఫోజు (ఫోటోలు)
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా శుక్రవారం సచివాలయంలో కలిశారు. నిజామాబాద్‌కు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కవితతోపాటు జగిత్యాల టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి డాక్టర్ సంజయ్ ఉన్నారు.
అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ కేంద్రంలో అర్థంపర్థంలేని మోడీ పాలన నడుస్తోందని విమర్శించారు. ఏపీకి రూ.8 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు నయాపైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
దీనికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాదు రూ. 2.31 కోట్లు కేటాయిస్తూ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎంపీ కవిత చెబుతున్న సంగతి తెలిసిందే.
{photo-feature}












Click it and Unblock the Notifications