ఆడబిడ్డలకు అన్నలా,తమ్ముడిలా,మేనమామలా,కంటికి రెప్పలా మారిన కేసిఆర్.!సీఎంపై కవిత ప్రశంసలు.!

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం చంద్రశేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.

షీ టీమ్ లతో మహిళా రక్షణ : కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా, చంద్రశేఖర్ రావు న్యూట్రిషన్ కిట్ తో ఇంటి డాక్టర్ లా, కేసీఆర్ కిట్ తో మేనమామలా, అమ్మఒడి తో సంరక్షకుడిలా, ఆరోగ్య లక్ష్మి తో ఆరోగ్య దాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని కవిత పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలు భాగస్వామ్యం చేసిన ఘనత చంద్రశేఖర్ రావుకు దక్కుతుందని అన్నారు.

kavitha

ఆడబిడ్డల అభివృద్ధికి కెసిఆర్ పెద్దపీట : "తెలంగాణ మహిళా లోకానికి అన్నగా, తమ్ముడిగా, మేనమామగా, ఇంటి పెద్దగా.. అన్నీ తానై ఆడబిడ్డకు ఏ ఆపదా రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న మహిళా పక్షకపాతి మన చంద్రశేఖర్ రావు " అని ప్రశంసించారు. ఈ దశాబ్దంలో మహిళా సంక్షేమంలో దేశంలో తెలంగాణ దరిదాపుల్లోకి కూడా మరే రాష్ట్రం రానంత రీతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను రూపొందించి, దిగ్విజయంగా అమలు చేస్తోందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

kavitha

మహిళ సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం : గత తొమ్మిది సంవత్సరాలలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది పొందారని, 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా, మహిళా సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రంలో స్త్రీ జాతి సగర్వంగా, సంతోషంగా జీవించడం ఒక మహిళగా నాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.

kavitha

ఆసరా పెన్షన్లతో అండగా నిలబడ్డ కేసీఆర్ : వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కవిత స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడి కార్మికులకు తెలంగాణలో మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. 15, 85, 088 మంది వితంతువులకు నెలకు రూ. 2016 చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 20556.11 కోట్ల మేర పెన్షన్ రూపంలో అందించిందని, 143930 మంది ఒంటరి మహిళలకు రూ.1545.8 కోట్ల మేర పెన్షన్లు అందించిందని కవిత వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+