వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత సంచలనం
2029 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత ప్రోగ్రామ్ లో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా..? అని అడగ్గా.. అందుకు యెస్ అని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించగా ఆమె సమాధానాలు తెలిపారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. సామాజిక మాధ్యమమైన ఎక్స్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత అనే ప్రోగ్రామ్ లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అని ఓ యూజర్ ప్రశ్నించగా.. అందుకు కవిత యెస్ అని రిప్లై ఇచ్చారు. దాంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు స్పష్టం అయింది.
అలాగే మరో యూజర్ ప్రశ్నిస్తూ.. . జాగృతి కార్యక్రమాలను కేవలం నగరానికే పరిమితం చేశారని.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. దానికి కవిత స్పందిస్తూ.. తెలంగాణలోని ప్రతి గ్రామంలో కమిటీను ఏర్పాటు చేస్తామని.. నెమ్మదిగా.. కానీ బలంగా ముందుకొస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించగా ఆమె సమాధానాలు తెలిపారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
మరో నెటిజన్ ప్రశ్నిస్తూ.. జాబ్స్, స్కిల్స్, సేఫ్టీ.. ఈ మూడింటిలో తెలంగాణ యువత కోసం మీరు దేన్ని ఎంచుకుంటారు..? అని ప్రశ్నించగా జాబ్స్ అని స్పష్టం చేశారు. అలాగే భద్రత కూడా ఇవ్వాలని అన్నారు. మరో నెటిజన్.. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇతరుల కంటే భిన్నంగా ఏం చేస్తారు..? అని అడగ్గా.. తల్లిదండ్రులు పిల్లల విద్యకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చూస్తానని అన్నారు.

తెలంగాణ భవిష్యత్తును ఉచిత విద్యతోనే పెంపొందించాలని కవిత తెలిపారు. మరొకరు ప్రశ్నిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీ వ్యూస్ ఏంటి అని ప్రశ్నించగా.. హామీలు కనుమరుగయ్యాయి.. వాగ్ధానాలు ఫెయిల్ అయ్యాయి.. ప్రజలు ఈ ప్రభుత్వంపై నిరాశతో ఉన్నారు.. అని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications