ఆత్మహత్యలు: గత పాలకులపై కవిత నింద, సలహాదారుగా కోదండ సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గత పాలకుల నిర్వాకమే కారణమని టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
గత పాలకులు తెలంగాణకు సాగునీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గత పాలకుల తప్పిదాల కారణంగా రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
గతేడాది పాలనలో ఎక్కడా ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశామన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టిందన్నారు.

రైతులను ఆదుకునేందుకు క్రీడాకారులు ముందుకొచ్చారన్నారు. గుత్తా జ్వాల, సానియా మీర్జా, ప్రజ్ఞాన్ ఓజా ముందుకొచ్చారని చెప్పారు. అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలను ఆదుకునేందుకు వివిధ పారిశ్రామికవేత్తలు, సంస్థలు, ప్రముఖులు ముందుకొస్తున్నారన్నారు.
తెలంగాణలో 252 రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆమె అన్నారు. 80 కటుంబాలను జాగృతి సంస్థ దత్తత తీసుకుందని చెప్పారు. 60 ఏళ్లుగా ఏపీ పాలకులు రైతులకు నీళ్లు ఇవ్వలేదన్నారు. కోదండరాం సలహాదారుగా ఉండేందుకు అంగీకరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications