ముహూర్తాలు చూస్తున్నాం.. మూడునెలల్లోనే అది జరుగుతుంది: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కవిత ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కావచ్చని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో కవిత రాజకీయ పార్టీ

గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కవిత నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగాను పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో, బిఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన కవిత రాజకీయంగా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్న కవిత త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించారు.

kavitha made sensational statement on her party process will be completed with in next three months

ప్రకటనకు ముహూర్తాలు చూస్తున్న కవిత

అయితే ఈ క్రమంలోనే తాజాగా ముహూర్తాలు చూస్తున్నామని మూడు నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని, త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందంటూ మరోమారు స్పష్టం చేశారు కవిత. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలలో విమర్శలపైన మాట్లాడిన ఆమె తెలంగాణలో రాజకీయ విమర్శలు హద్దు మీరుతున్నాయి అన్నారు. వ్యక్తులను, జాతిని కించపరిచే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని కవిత పేర్కొన్నారు.

కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు

తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉందని, దాన్ని ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపైన కవిత స్పందించారు. ఈ కేసులో ఆదేశాలు ఇచ్చిన పెద్ద చేపను వదిలేసి, చిన్నచేప అయిన డీఎస్పీ ప్రణీత్ రావు పైన సిట్ అధికారులు చర్యలు తీసుకున్నారని కవిత ఆరోపించారు.

టీవీ సీరియల్ లా ఫోన్ ట్యాపింగ్ కేసు

ఈ కేసు టీవీ సీరియల్ లాగా సాగుతుందని, పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుంటున్నారు అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. ఇంతేకాదు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఆర్టీసీ కళ్యాణమండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు కవిత వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారుడు తెలంగాణ వాదులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+