Kavitha New Party: కవిత కొత్త పార్టీ.. రాజకీయ శక్తిగా ‘తెలంగాణ జాగృతి’!
Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. శాసనమండలి వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన తదుపరి కార్యాచరణను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన స్వచ్చంద సంస్థ తెలంగాణ జాగృతిని ఓ రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "వ్యక్తిగా వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి.
రాజకీయ పార్టీగా 'తెలంగాణ జాగృతి'
తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేసిన 'తెలంగాణ జాగృతి' ఇకపై రాజకీయ క్షేత్రంలో పోరాడనుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను కవిత ఏకరువు పెట్టారు. రూ.14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా, పేదలకు ఇళ్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేదని, నిరుద్యోగులను కేవలం మభ్యపెట్టారని మండిపడ్డారు. భూ కబ్జాలు, కలెక్టరేట్ల నిర్మాణం కోసం అసైన్డ్ భూముల బదిలీ వంటి అంశాలను తాను ఎప్పటికప్పుడు అప్పటి నాయకత్వం(కేసీఆర్) దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తీరుపైనా ధ్వజం
బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని కవిత విమర్శించారు. "నాది ఆస్తుల పంచాయితీ అని కాంగ్రెస్ తలతోక లేని ఆరోపణలు చేస్తోంది. బీఆర్‌ఎస్ చేసేవి చెత్త ఆరోపణలైతే, కాంగ్రెస్ చేసేవి అతి చెత్త ఆరోపణలు" అని ఆమె మండిపడ్డారు. తన రాజీనామాను ఆమోదిస్తే తనకు పూర్తి స్వేచ్ఛ వస్తుందని, ప్రజల కోసం ఒక వజ్రాయుధమై పనిచేస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు."యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నాను.. ఇది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ. ఆ అవమాన భారంతోనే 'ఇంటి పార్టీ' నుంచి బంధం తెంచుకుని బయటకు వస్తున్నాను. తెలంగాణ మహిళలకు రోషం ఎక్కువ, అవమానిస్తే చూస్తూ ఊరుకోరు." అని కవిత పేర్కొన్నారు.
విద్యార్థి లోకానికి పిలుపు
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, యువత తనతో కలిసి నడవాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివాసీ, గిరిజన, మహిళా మరియు మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా తన కొత్త పార్టీ పనిచేస్తుందని కవిత వెల్లడించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications