నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనే కేసీఆర్ తనయ, మళ్ళీ మంత్రి పదవిపై చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితను జాతీయ రాజకీయాల్లోకి తీసుకు వెళతారు అన్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. కవితను రాజ్యసభ సభ్యురాలిగా పంపిస్తారని ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో, ఫైనల్ గా కవిత మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే ఉండనున్నట్లుగా తేలిపోయింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆమెకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లోనే కవిత కీలకంగా వ్యవహరించనున్నారని నిర్ధారణ అయింది.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరు ఖరారు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరు ఖరారు


సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోమారు పేరు ఖరారు చేయడంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు అన్న చర్చ జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో, ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటీవల కాలంలోనే కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టారు. తక్కువ సమయంలోనే పదవీకాలం ముగియనుండడంతో, మరోమారు ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు కెసిఆర్.

రాజ్యసభకు కవిత వెళ్తారన్న ప్రచారానికి తెర

రాజ్యసభకు కవిత వెళ్తారన్న ప్రచారానికి తెర

మొదట అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కెసిఆర్ నిజామాబాద్ అంశం మాత్రం పెండింగ్లో పెట్టడంతో కవితకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇస్తున్నట్లుగా చర్చ జరిగింది. అయితే దీనికి కవిత ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయకుండానే మళ్లీ జాతీయ రాజకీయాల వైపు తనను పంపించాలన్న నిర్ణయాన్ని కవిత వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా తాను తెలంగాణ రాజకీయాల్లోనే కీలకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కవిత వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరోమారు కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

జాతీయ రాజకీయాల్లోకి కవిత అంటూ చర్చ ... కానీ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం

జాతీయ రాజకీయాల్లోకి కవిత అంటూ చర్చ ... కానీ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం

రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీగా మండలిలోకి తీసుకు రావడంతో ఆ స్థానంలోకి కవితను పంపించి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా మళ్లీ కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కవిత రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారని క్లారిటీ వచ్చింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గతంలో ఉన్న భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో అనర్హత వేటు వేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అవడంతో అక్కడినుండి ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు.

ఎమ్మెల్సీ అయితే కవితకు మంత్రిగా ఛాన్స్ ? తెరమీదకు కొత్త చర్చ

ఎమ్మెల్సీ అయితే కవితకు మంత్రిగా ఛాన్స్ ? తెరమీదకు కొత్త చర్చ

ఎమ్మెల్సీగా కవిత పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. దీంతో మళ్లీ అదే స్థానం నుంచి కవితకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. మరి ఎమ్మెల్సీగా ఉన్న కవితకు సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారా ?మంత్రిగా అవకాశం దక్కకుంటే కవిత ఊరుకుంటారా? ఒకవేళ మంత్రిగా అవకాశం కల్పిస్తే ఇప్పటికే కెసిఆర్ కుటుంబం పై కుటుంబ పాలన అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, కవితను కూడా మంత్రిగా చేస్తే మరింత విజృంభించే ప్రమాదం లేకపోలేదు. మరోమారు కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కవిత విషయంలో భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చగా మారింది.

English summary
Nizamabad Local Bodies MLC candidate once again CM KCR gave the opportunity to Kalvakuntla Kavitha . KCR daughter will be in state politics. With this, the debate on the ministerial post started again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X