స్విమ్మింగ్ పూల్ లా కాజీపేట రైల్వేస్టేషన్.. చెరువుల్లా రోడ్లు; వరంగల్ కు మళ్ళీ వానగండం!!
అత్యంత భారీ వర్షాల నేపధ్యంలో వరంగల్ జిల్లా వణికిపోతోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాల దెబ్బకు ఓరుగల్లు చిగురుటాకులా వణుకుతోంది. 100కు పైగా కాలనీలు జలమయం కావడంతో ఓరుగల్లులో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఓరుగల్లు వాసులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
ఇప్పటికే వరంగల్ నగరం అంతటా ఎటు చూసినా సంద్రాన్ని తలపిస్తుంది. నగరం లోని ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ముంచెత్తుతున్న వరద ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. కాజీపేట, వరంగల్, హన్మకొండ త్రి నగరాలలోనూ వరద ముంపు కనిపిస్తుంది.

హనుమకొండ కరీంనగర్ జాతీయ రహదారి భీమారం ప్రొద్దుటూరు గార్డెన్స్ దగ్గర ప్రస్తుత పరిస్థితి .ORR చింతగట్టు pic.twitter.com/KY9IofeLA6
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలి పడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వరంగల్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.
ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి అంధకారంలోనే ఓరుగల్లు వాసులు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. హన్మకొండ గోపాలపురం చెరువులో గట్టు రాజు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. హన్మకొండ అలంకార్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగి పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక చోట్ల ముంపు ప్రాంతాల ప్రజలు సహాయం కోసం అర్ధిస్తున్నారు.
నీట మునిగిన వరంగల కాజీపేట రైల్వే స్టేషన్ pic.twitter.com/SU1c8KPZrx
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
వరంగల్ లో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితులు దారుణంగా ఉండేలా ఉంది. గతంలో ఎన్నడూ రానంతగా వరద ఓరుగల్లును ముంచెత్తటంతో అధికారులు ఎంత సహాయం చేసినా అవి నామమాత్రంగానే అనిపిస్తున్నాయి. వరుణదేవుడు ఇకనైనా శాంతించాలని ఓరుగల్లు వాసులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications