వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని హతమార్చిన కుమారుడు.. ఎక్కడంటే..?
వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో కన్న తల్లినే దారుణంగా గొంతు కోసం హతమార్చాడు ఓ యువకుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా గంటల తరబడి ఫోన్ లు చూస్తూ కూర్చోవడం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్ రీల్స్, ఇన్ స్టా రీల్స్ చూసేందుకు నేటి గృహిణులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మితిమీరిన ఇన్ స్టా గ్రామ్ వినియోగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ కుటుంబాన్ని రోడ్డు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన నాగుల సుధాకర్, ఉదయశ్రీ దంపతులు. 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇక సుధాకర్ స్థానిక ప్రైవేట్ కంపెనీలో అటెండర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్య ఉదయశ్రీ ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చూస్తూ కాలం గడిపేది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో నాలుగేళ్ల క్రితం కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తితో ఉదయశ్రీకి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో పిల్లల్ని, భర్తను వదిలి వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి చేష్టలను గుర్తించిన కుమారుడు దొరబాబు పలు మార్లు పద్దతి మార్చుకోవాలని కోరాడు. అయినా కూడా ఉదయశ్రీ వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది.

ఈ క్రమంలో సదరు వ్యక్తితో కలిసి ఉదయశ్రీ వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతుండగా అది గుర్తించిన కుమారుడు దొరబాబు తల్లిని బెడ్ రూంలోకి తీసుకెళ్లి, వివాహేతర సంబంధం వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా తల్లి ససేమిరా అనడంతో కోపాద్రిక్తుడై ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దొరబాబు పరార్ అయ్యాడు. ఇక ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications
