సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ రేవంత్ కు హైకమాండ్ జలక్..!!
తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తి కర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రేవంత్ తో సీఎం పదవి కోసం పోటీ పడిన నేతలు ఢిల్లీలోనే మకాం వేసారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయల్దేరిన రేవంత్ కు తిరిగి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావటంతో వెనక్కు వెళ్లారు. కేబినెట్ విస్తరణ పైన మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగిస్తూనే రేవంత్ కు హైకమాండ్ జలక్ ఇచ్చింది.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లు : రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీలో సీనియర్లను కాదని రేవంత్ కు హైకమాండ్ సీఎం పగ్గాలు అప్పగించింది. పార్టీ హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుతో పాటుగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేసింది. సీనియర్లు తాము ఆరేడు సార్లు పార్టీ నుంచి గెలిచి..పార్టీ కోసం కష్టపడ్డామని వివరించారు. భట్టి, ఉత్తమ్ హైమాండ్ తో సీఎం పదవికి తమ పేర్లు పరిశీలన లోకి తీసుకోవాలని కోరారు. కానీ..తాము నిర్దేశించిన లక్ష్యాలను రేవంత్ పూర్తి చేయగలగడనే నమ్మకంతో హైకమాండ్ ఉంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్న సమయంలో నూ రేవంత్ కు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది.

రేవంత్ కు దిశా నిర్దేశం : అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే రేవంత్ కు తాము చెప్పదలచుకుంది చెప్పారు. సీనియర్ల సమక్షంలోనే రేవంత్ కు గీతోపదేశం చేసారు. తెలంగాణలో ఒన్ మ్యాన్ షో ఉండదని స్పష్టం చేసారు. పరోక్షంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని రేవంత్ కు తేచ్చి చెప్పారు. సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఉంటుందని..టీం వర్క్ తో పని చేస్తారని పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా చెప్పుకొచ్చారు. సీనియర్లను కలుపుకొని పార్టీ విజయం సాధించటంలో రేవంత్ పాత్రను ప్రశంసిస్తూనే.. సీనియర్లకు పార్టీలో ఇచ్చే గౌరవం గురించి సందేహాలకు అవకాశం లేకుండా క్లారిటీ ఇచ్చారు.

సీనియర్లకు ప్రాధాన్యత : కేబినెట్ కూర్పులోనూ రేవంత్ ప్రతిపాదనలను హైకమాండ్ పరిశీలిస్తోంది. సామాజిక సమతుల్యత-సీనియార్టీ- విధేయతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గానికి తుది రూపు ఇస్తోంది. ఇక...ప్రభుత్వం - పార్టీలోనూ ఏక పక్ష నిర్ణయాలు ఉండకూడదని - సమిష్టి నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్దేశించింది. తొలుత సీఎం పదవి కోసం రేసులో పోటీ పడినా..హైకమాండ్ నిర్ణయంతో చివరగా సీనియర్లు ఏకీభవించారు. దీంతో..సీనియర్లకు తగిన గౌరవం..ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవాలని హైకమాండ్ రేవంత్ కు స్పష్టం చేసింది. కేసీ వేణుగోపాల్ ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications