కవితను కాదని.. నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన కేసీఆర్
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ నుంచి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను బుధవారం ప్రకటించారు కేసీఆర్.
వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్, చేవెళ్లలో బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఇతరులకు అవకాశాలను కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం కల్పించారు.

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు దఫాలుగా ప్రాతినిథ్యం వహించారు. మరోసారి పోటీకి సిద్ధమని చెప్పిన ఆయన.. అవకాశం కల్పించకపోయినా పార్టీలో కార్యకర్తగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు కేసీఆర్.
అయితే, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు పోటీ చేసిన కల్వకుంట్ల కవితను కాదని.. గోవర్ధన్‌కు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2014లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన కవిత.. 2019లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజా ప్రకటనతో మొత్తం 9 మంది అభ్యర్థ్వాలను ప్రకటించినట్లయింది. వాటి విషయానికొస్తే..
1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్సీ )- కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్సీ) - డాక్టర్ కడియం కావ్య
8 )జహీరా బాద్ - గాలి అనిల్ కుమార్
9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్.
తనకు జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ నుంచి అవకాశం ఇచ్చినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్. pic.twitter.com/jwvVvJoOq7
— BRS Party (@BRSparty) March 13, 2024
జహీరాబాద్ మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) March 13, 2024
జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ పేరును నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. pic.twitter.com/ouK7DWFf7z
చేవెళ్ల మరియు వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) March 13, 2024
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు.
అదే విధంగా నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి… pic.twitter.com/EtNAuv2Yke












Click it and Unblock the Notifications