KCR: గంట ముందే అసెంబ్లీకి కేసీఆర్.. ఘన స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు
KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బుధవారం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కొంతకాలంగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. గంట ముందే అసెంబ్లీకి రావడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. మళ్లీ అప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకపోవడం గమనార్హం. తాజాగా ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
Leader of the Opposition and BRS President Sri KCR, has reached the State Legislative Assembly to participate in the State Budget Session scheduled to start today. pic.twitter.com/wSEMzOXzY5
— BRS Party (@BRSparty) March 12, 2025












Click it and Unblock the Notifications