• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కట్టడాలపై ఉన్న శ్రద్ద ప్రజల కష్టాలమీద లేదు..! కేసీఆర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..!!

|
  మితిమీరిన ఖర్చుపై కేసీఆర్ ను నిలదీసిన భట్టి..!! || Batti Vikramarka Comments CM KCR || Oneindia

  హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రశేఖర్చ రావు ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చెసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దశబ్దాల కాలం పరిపాలనలో కేవలం 69 వేల కోట్ల రూపాయలు అప్పుచేసారని ఆ మొత్తాన్ని కూడా ఆస్తుల రూపంలో మనకు అందించారని అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, మిడ్ మానేరు, కోయిల్ సాగర్ వంటి భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను కట్టడంతో పాటు, విద్య, వైద్యం, మౌలిక అవసరాలు వంటి వాటి కోసం ఖర్చు చేసారని అన్నారు.

   ప్రజాసమస్యలు పక్కన పెట్టి ప్యాలెస్ లు అవసరమా..? కేసీఆర్ పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..!!

  ప్రజాసమస్యలు పక్కన పెట్టి ప్యాలెస్ లు అవసరమా..? కేసీఆర్ పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..!!

  టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఈ నాలుగైదు ఏళ్లలోనే అప్పులను లక్ష 85 వేల కోట్లకు పెంచిందని, ఇది ప్రజలపై భారం మోపడమేనని భట్టి అన్నారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్యాలెస్ లు కట్టడం అవసరం ఏమి వచ్చిందని భట్టి ప్రశ్నించారు. అప్పుల తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నారని ఆయన అన్నారు. అందరి ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టాలని భట్టి చెప్పారు. నిరుద్యోగ సమస్య ,నిధుల సమస్య, ఆత్మ గౌరవ సమస్య, డబుల్ బెడ్ రూమ్, ఉచిత విద్య ఇవ్వన్నీ సమస్యలు పక్కకు పెట్టి ప్యాలెస్ లు అవసరం లేదని భట్టి చెప్పారు.

   అప్పులు చేయడానికి పద్దతి లేదా..! ఇంతపెద్ద మొత్తం అప్పులు ఏంటన్న కాంగ్రెస్..!!

  అప్పులు చేయడానికి పద్దతి లేదా..! ఇంతపెద్ద మొత్తం అప్పులు ఏంటన్న కాంగ్రెస్..!!

  ఇపటివరకు తెచ్చిన, ఇకముందు తీసుకు వచ్చే అప్పులకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. అంతేకాక ఇప్పటివరకు తీసుకువచ్చిన అప్పులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరం 15 శాతం పూర్తి అయింది.. మొత్తం పూర్తి కాలేదని భట్టి చెప్పారు. మొత్తం పూర్తి కానీ ప్రాజెక్ట్ కు ప్రారంభోత్సవం ఏమిటని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరం వెనుక అంతుపట్టని మిస్టరీ ఉందని భట్టి అన్నారు.

  ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది..! కేసీఆర్ వివరణ ఇవ్వాలన్న టీపిసిసి..!!

  ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది..! కేసీఆర్ వివరణ ఇవ్వాలన్న టీపిసిసి..!!

  అందువల్లే ఎవరిని ప్రాజెక్ట్ వద్దకు అనుమతివ్వలేదని ఆయన చెప్పారు. ఇందులో ఉన్న అవినీతి బయట పెడతామని చెప్పారు. ప్రాజెక్టులను మేము అడ్డుకోవడం లేదు. అందులో ఉన్న అవినీతిని మాత్రమే బయట పెడతాం అని భట్టి విక్రమార్క చెప్పారు. అకౌంటీబిలిటీ లేని రిటైర్డ్ ఇంజనీర్ లతో చెప్పిస్తే ఎలా.. మాకు ఉన్న అనుమానాల పై స్మితా సబర్వాల్, కానీ చీఫ్ ఇంజనీర్, కానీ సీఎంచంద్రశేఖర్చ రావు సమాధానం చెప్పాలని అన్నారు. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ పై మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరితే అప్పటి స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదు.అందుకే మేము బయటకి వెళ్లిపోయామని చెప్పారు.

  కొత్త భవనాలెందుకన్న కాంగ్రెస్..! మితిమీరిన ఖర్చుపై కేసీఆర్ ను నిలదీసిన భట్టి..!!

  కొత్త భవనాలెందుకన్న కాంగ్రెస్..! మితిమీరిన ఖర్చుపై కేసీఆర్ ను నిలదీసిన భట్టి..!!

  తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా ఎనిమిది ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ సంధిస్తోంది. సీఎం చంద్రశేఖర్ రావు వాటికి సమాధానం చెప్పాని నిలదీస్తున్నారు నేతలు.1) రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. 2). అందరి ఎమ్మెల్యే ల ఒపీనియన్ తీసుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టాలి.మీ ఇళ్ళు కాదు ఒక్కనివి నిర్ణయం తీసుకోని కట్టడానికి. 3). నిరుద్యోగ సమస్య ,నిధుల సమస్య, 4). ఆత్మ గౌరవ సమస్య, డబుల్ బెడ్ రూమ్, 5).ఉచిత విద్య ఇవ్వన్నీ సమస్యలు పక్కకు పెట్టి ప్యాలెస్ లు అవసరమా?? 6). తెస్తున్న అప్పులకు క్లారిటీ ఇవ్వాలి. 7). కాళేశ్వరం 15 శాతం పూర్తి అయింది.. మొత్తం పూర్తి కాలేదు.8).18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము అని చెప్పిన చంద్రశేఖర్చ రావు మొన్న ప్రారంభించిన కాళేశ్వరం తో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The attention paid to the buildings is not on the problems of the people.Congress leaders furious over the KCR line in telangana.CM Chandrashekharcha Rao, who promised to provide 18 lakh acres of water with the Kaleshwaram project, demanded to know how many acres were given water during the inauguration.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more