'అమరావతి వెళ్లొచ్చాక కెసిఆర్‌లో మార్పు, మోడీ-బాబులకు భయం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లివచ్చాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం నాడు ఎద్దేవా చేశారు.

టిఆర్ఎస్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరినా ఆస్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెసిఆర్ పోలవరం అంశం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. పోలవరం గురించి ప్రస్తావిస్తే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబులకు కోపం వస్తుందని కెసిఆర్ భయపడ్తున్నారన్నారు.

ఆన్‌లైన్ పైరసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సినీరంగ ప్రతినిధులతో సమావేశమైయ్యారు. ఆన్‌లైన్ పైరసీని అరికట్టే విషయమై భేటీలో చర్చించారు. సమావేశంలో ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో నిర్మాత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

KCR changed after Amaravati tour

రూ.350 కోట్ల నష్టం: సురేష్ బాబు

సినిమాల పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు పని చేస్తున్నాయని సినీ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఆన్‌లైన్ పైరసీని అరికట్టే విషమయై సినీరంగ ప్రతినిధులు నేడు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం నిర్మాత సురేష్‌బాబు మాట్లాడారు.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. పైరసీ నిర్మూలనకు కొత్త పాలసీని తీసుకొస్తమన్నారు. పోలీసులు, ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, సినీ పరిశ్రమ వర్గాలు కలిస్తే పైరసీని అరికట్టవచ్చునని చెప్పారు.

పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు పని చేస్తున్నాయని, పైరసీ కారణంగా గడిచిన తొమ్మిది నెలల్లో పరిశ్రమకు రూ.350 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఏటా ఇలాగే నష్టం వస్తుందన్నారు. పైరసీ సీడీలు పట్టించే వారికి అవార్డులు ప్రకటిస్తామని సురేష్ బాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+