Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. కేసీఆర్ వర్సస్ రేవంత్ మధ్య ఈ ఎన్నికల యుద్దం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే...కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతాయనే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ లో బీజేపీ ఆలోచనల పైనా సందేహాలు వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నుంచి తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెబుతున్న నేతలు ఎవరు.

టచ్ లో కాంగ్రెస్ నేతలు
తమతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పలం కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపేందుకు 25, 26 మంది రెడీగా ఉన్నామని తమ పార్టీ నేతలతో చెప్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజీపీఎల్పీ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి రెండు లేదా మూ డు రోజులకోసారి వచ్చి స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారని గుర్తు చేసారు. మూడు నెలల్లో ఈ ప్రభుత్వం పోతది, డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తది అని లక్ష్మణ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వటం పైన కేసీఆర్ వ్యాఖ్యానించారు.

KCR claims 25 congress MLAs were in contact with them Key comments on Revanth Govt

బీఆర్ఎస్ కు ఆఫర్
ముఖ్యమంత్రే మారుతారని ప్రచారం జరుగుతుంటే..ఒక్కరోజు కూ డా సీఎం ఖండించలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ఏదో కార్యక్రమానికి హైదరాబాద్‌ వస్తే, ఆప్‌ బడే భాయ్‌ హై, మై చోటే భాయ్‌ హై అనటం పైన కేసీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కొందరిలో అనుమానాలు మొదలయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఉన్న కొందరు మీరు, మేము కలిసి గవర్నమెంట్‌ ఫామ్‌ చేద్దామని తమ నేతల వద్దకు ప్రతిపాదనలు వచ్చాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆ సమచారం తనకు వచ్చిందన్నారు. అయితే, ఎవరనేది చెప్పేందుకు కేసీఆర్ నిరాకరించారు.

KCR claims 25 congress MLAs were in contact with them Key comments on Revanth Govt

రేవంత్ వర్సస్ కేసీఆర్
కేసీఆర్ సభల్లోనే చేసిన ఇదే తరహా వ్యాఖ్యల పైన రేవంత్ ఘాటుగా స్పందించారు. తాను జానారెడ్డి, జైపాల్ రెడ్డిని కాదని..తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఇదే అంశం పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 8-12 సీట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి లేదంటే అసలు రాకపోవచ్చిన చెప్పుకొచ్చారు. కడియం శ్రీహరి చేసిన పనితో తాము వరంగల్ గెలుస్తున్నామని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యల పైన ఎన్నికల సభల్లో కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+