జర్నలిస్ట్ లకు కనీస మర్యాద ఇవ్వని కేసీఆర్ !విలేఖరుల ధర్నాకు షర్మిళ సంఘీభావం.!
హైదరాబాద్ : సామాన్యప్రజానీకానికీ, ప్రతిపక్ష పార్టీలకు మద్య వారదిగా విలేఖరులు వినూత్న వృత్తిలో కొనసాగుతుంటారని వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ ఉద్ఘాటించారు. ఇందిరాపార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న మహా ధర్నాలో వైఎస్ షర్మిల పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. జర్నలిజంకి నా సలాం,జర్నలిస్టులకు సలామ్.., ప్రజలకు, ప్రతిపక్షాలకు గొంతు మీరే అంటూ ప్రసంగించారు షర్మిళ. జర్నలిస్ట్ అనే వాళ్లు లేకుంటే సమస్యలు బయటకు రావని, 9 ఎండ్ల బంగారు తెలంగాణలో జర్నలిస్టులు ఆందోళన చేయడం బాధాకరమన్నారు షర్మిళ.
జర్నలిస్టులు హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారు : జర్నలిస్టులు సన్మానం చేయమని అడగలేదని, కేవలం వారికి రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని, చంద్రశేఖర్ రావు జర్నలిస్టులను విస్మరించడం అన్యాయమన్నారు షర్మిళ. దివంగత వైయస్సార్ హయాంలో జర్నలిస్టులకు ఎంతో నాయ్యం జరిగిందని, వైయస్సార్ హయంలోనే 70 ఎకరాలు జవహర్ లాల్ హౌజింగ్ సొసైటీకి కేటాయించారన్నారు షర్మిల. ప్రస్తుతం అది కాస్త కేసుల్లో ఇరుక్కుందని విచారణ వ్యక్తం చేసారు. అంతే కాకుండా టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల విషయంలో తాము సీఎం చంద్రశేఖర్ రావు విధానాలను తప్పు పడితే కేసు పెట్టారని, పోలీసుల చేత తన మీద ఒక కేసు పెట్టించారన్నారు షర్మిళ.


జర్నలిజానికి, జర్నలిస్టులకు సలాం : అంతే కాకుండా సొసైటీలో భూముల కేసు సుప్రీం కోర్టులో గెలిచినా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి చిత్త శుద్ది లేదన్నారు షర్మిల. వరంగల్ వెళ్లి అక్కడ కాలనీ కడుతం అని చెప్పారని, హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పడేలా కాలనీ అన్నారని, క్లబ్ హౌజ్లు అన్నారని, సినిమా హాల్స్ అన్నారని, మార్కెట్ లు అన్నారని, కానీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని షర్మిళ గుర్తు చేసారు. జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయా అని షర్మిళ నిలదీసారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావు అని అందుకే ఇవ్వడం లేదన్నారు. కేసీఅర్ పాలనలో అసలు జర్నలిస్ట్ లకు కనీస మర్యాద కూడా లేదన్నారు షర్మిళ.

ఒక్క ఫోన్ కొడితే చాలు స్పందిస్తాను : జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ చంద్రశేఖర్ రావును జర్నలిస్టులు పక్షాన డిమాండ్ చేస్తుందన్నారు షర్మిళ. వారికి ఆరోగ్య భద్రత కల్పించే అంశాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరుపున తమ మ్యానిఫెస్టోలో పెడుతున్నామన్నారు. ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలం కేటాయిస్తామని మాట ఇస్తున్నామన్నారు. విలేఖరుల పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఒక్క ఫోన్ కొడితే చాలు, మీ సమస్య కోసం నేను పోరాటం చేస్తానని ఇందిరా పార్క్ లో నిరసన తెలుపుతున్న జర్నలిస్టు సంఘాలకు మాటిచ్చారు షర్మిళ.












Click it and Unblock the Notifications