తెలంగాణ ప్రజల కష్టార్జితం..కేసీఆర్ అవినీతికి బలైంది.!ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫైర్.!

ఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శలకు గురవుతోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం పరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు జలమయం అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపేద గ్రామీణ ప్రజల పాలిట శరాఘాతంగా మారిందని టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఇందులో భాగంగా అన్నారం పంప్ హౌస్ నీళ్లలో నిండా మునిగిపోవడం శోచనీయమన్నారు రేవంత్ రెడ్డి.

 కాళేశ్వరం లోతట్టు ప్రాంతాలు జలమయం.. సీఎం నిర్లక్ష్యంతోనే అన్నారం పంప్ హౌస్ మునిగిందన్న రేవంత్

కాళేశ్వరం లోతట్టు ప్రాంతాలు జలమయం.. సీఎం నిర్లక్ష్యంతోనే అన్నారం పంప్ హౌస్ మునిగిందన్న రేవంత్

తెలంగాణ ప్రభుత్వంపై పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి మండి పడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహాని జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజల ఆస్తులు, గృహాలు వరదలో కొట్టుకుపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ప్రభుత్వ వాఖలను, ప్రకృతి విపత్తు విభాగాలను సిద్దంగా ఉంచాల్సిన సీఎం చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి సీఎం ప్రతిస్పందించలేదని ఘాటు విమర్శలు చేసారు రేవంత్ రెడ్డి.

 కాళేశ్వరం లోతట్టు ప్రాంతాలు జలమయం.. సీఎంకు ముందుచూపు లేదన్న పీసిసి ఛీఫ్

కాళేశ్వరం లోతట్టు ప్రాంతాలు జలమయం.. సీఎంకు ముందుచూపు లేదన్న పీసిసి ఛీఫ్

అంతే కాకుండా రాజకీయ అంశాలపై సీఎం చంద్రశేఖర్ రావు సమీక్షలు జరుపుతున్నారు తప్ప ప్రజలకు సహాయక చర్యలపై సమీక్ష జరపలేదన్నారు రేవంత్ రెడ్డి.
20 అసెంబ్లీ నియజక వర్గాల్లో వరద ప్రభావం ఉంన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయిందని,మరో రెండు మూడేళ్లు నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శంగా నిలిచిపోతుందన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ రావు నిద్ర మత్తు వదిలి వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు రేవంత్.

కేంద్రం ఆదుకోవాలని.. నష్టపరిహారం చెల్లించాలన్న రేవంత్ రెడ్డి


ఇదిలా ఉండగా ఈ నెల 17 తేదీ నుంచి ఆదిలాబాద్, వరంగల్,కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సహాయక బృందాలు పర్యటించి వరద బాధితులకు సహాయం అందజేస్తామన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. 10-12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,వెంటనే పంట నష్టం ఆర్ధిక నష్టం పై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం చంద్రశేఖర్ రావుకు సూచించారు రేవంత్ రెడ్డి. ప్రధాని, హోం మంత్రి తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయాలని, తెలంగాణలో పర్యటించాలని, వరద బాధితులకు కేంద్రం సహాయం అందించాలని రేవంత్ డిమాండ్ చేసారు.

 ముంపు ప్రాంతాలల్లో పర్యటిస్తా.. కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసిన రేవంత్

ముంపు ప్రాంతాలల్లో పర్యటిస్తా.. కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసిన రేవంత్


అంతే కాకుండా భారీ వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉందని, అనేక లేఖలు కూడా రాసామని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. చంద్రశేఖర్ రావు వైఫల్యం కారణంగానే అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాలు నీట మునిగాయని, సరైన సహాయక పునరావాస చర్యలు చేపట్టలేదని, చంద్రశేఖర్ రావు ఇప్పటికైనా నిద్రమత్తు, మందు మత్తు విడిచిపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం వారీగా కాంగ్రెస్ పార్టీ సహాయక బృందాలను నియమిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ కార్యక్రమాలు అందజేస్తారు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+