అరె కేసీఆర్.!బీసి బంధు అమలు చెయ్.!బీసీల్లో కూడా నిరుపేదలు ఉన్నరు రా బై.!వీహెచ్ కొత్త డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకొచ్చిన వినూత్న పథకం మాదిరిగానే వరికొన్ని వెనుకబడిన కులాలకు కూడా న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తాజాగా వెనుకబడిన వర్గాల్లో అనేక మంది ఆర్థికంగా చితికిపోయారని, అలాంటి వర్గాలను ఆదుకోవడానికి మరో పథకానికి రూపకల్పన జరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువాగా ఉన్న బీసీ వర్గాల సంక్షేమం కోసం మరో ప్రణాళిక అవసరమని బీసీ నేతలు తేల్చి చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు పెట్టినట్లే బీసీ బంధు అమలు చేయాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు, వి.హనుమంతరావ్ డిమాండ్ చేసారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఈబిసి బిలు ప్రవేశ పెట్టారని, ప్రధాని ప్రవేశపెట్టిన బిల్ లో కొత్తదనం ఏమీలేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని వీహెచ్ కేంద్రానికి సవాల్ విసిరారు. బీసీ లలో కూడ ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే బీజి బంధును అమలు చేయాలని వీహెచ్ డిమాంగ్ చేసారు. హుజురాబాద్ లో ప్రవేశ పెట్ట బోతున్న దళిత బంధు తరహాలోనే రాష్ట్రమంతటా బిసి బంధు ప్రవేశపెట్టాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో అత్యధిక ఓట్లు బడుగు బలహీనవర్గాల వారివే ఉన్నాయని, బిసిలను విస్మరిస్తే టీఆరెస్ కు హుజురాబాద్ లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లేదంటే బీసీ బంధు కోసం రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టిన ఈ ప్రభుత్వం, ఆ విగ్రహాన్ని విడుదల చేస్తే చంద్రశేఖర్ రావు అసలైన దళిత ప్రేమికుడని విశ్వసిస్తామని వి.హనుమంతరావు తెలిపారు.












Click it and Unblock the Notifications