Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీశ్ రావు...: ఏపీ రాజకీయాలపైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ మనుగడపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలుచేశారు. అవినీతి మరకలేని నేతలనే కాంగ్రెస్‌​లోకి తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్​‌చాట్​లో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. లోక్‌​సభ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌​లో చాలా మంది నేతలు అవమానానికి గురై ఉన్నారని చెప్పారు. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే ఎలా వాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలన్న రాజగోపాల్ రెడ్డి.. ఎన్నిసార్లు అధికారంలో ఉంటామనేది ఎవ్వరు చెప్పలేమన్నారు.

KCR heir is Harish Rao, not KTR for BRS: Komatireddy Rajagopal Reddy hot comments

అంతేగాక, దేశంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే టాక్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే, 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు. ఐదేఏళ్లు తమ ప్రభుత్వానికి ఏమి ఢోకా లేదని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళితబంధు తెచ్చారని.. దళితులపై ప్రేమతో కాదని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదని రాజగోపాల్ రెడ్డి సూచించారు. బీఆరెఎస్ బతకాలంటే హరీశ్​ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి. కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే... పార్టీలో ఒక్కడు ఉండడు. కేసీఆర్ వారసుడు హరీశ్ రావు. హరీశ్​ రావు పార్టీ అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ బతుకుతుంది. కేటీఆర్ పొలిటీషియన్ కాదు, హైటెక్ పొలిటీషియన్ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్‌​లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లేనని రాజగోపాల్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు గెలవదని జోస్యం చెప్పారు. రాబోయే లోక్‌​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం తమతోనే ఉందని, వారితో కలిస్తే మొత్తం 72 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం ఉంటుదన్నారు.

భువనగిరి నుంచి బీసీకి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదేనని రాజగోపాల్ చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌​లో కాంగ్రస్ ఓటు చీల్చితే వైసీపీకే లాభమన్నారు రాజగోపాల్ రెడ్డి. వైసీపీకి ప్రభుత్వ లబ్ధిదారుల ఓటు బ్యాంకు బలంగా ఉందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+