కాంగ్రెస్ వస్తే రైతులు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్ హెచ్చరిక
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్‌నే అని దుయ్యబట్టారు. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని చెప్పారు. వందల మందిని పొట్టన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టలేదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిజాం సాగర్‌కు ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారీ రాజ్యం మళ్లీ వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దుబారా అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. మరి కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్ అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుర్మార్గపు కాంగ్రెస్‌ను రైతులు మట్టి కరిపించాలను ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో సైతం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications