'కేసీఆర్ చావమంటే నేను చస్తా!: ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు

ఆదిలాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఏమైనా పని ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి పని జరిగేలా చూసుకుంటానని.. తనకు కేసీఆర్ మధ్య మీడియేటర్లు అవసరం లేదని శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు.

అంతేగాక, తనకు కేసీఆర్ మాత్రమే బాస్ అని.. తాను చావమంటే చస్తానని.. మీరు చస్తారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. పార్టీ కన్నతల్లి వంటిదని.. అందరూ గౌరవించాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణుల మధ్య విభేదాలు వద్దన్న ఎమ్మెల్యే.. కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

KCR

రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూములను వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చి రైతుబంధు, రైతుబీమా, రుణ సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు అనునిత్యం గుర్తుంచుకుంటారని చెప్పారు. కేసీఆర్‌ తెలంగాణ సీఎంగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని, రాష్ట్రంలో గృహలక్ష్మి, దళితబంధు, బీసీలకు రూ.లక్ష అందించే ప్రక్రియ నిత్యం కొనసాగుతుందన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్రూం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తున్నదని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్ర చేస్తే ఇక్కడి ప్రజలు సహించరని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని.. దానికి కార్యకర్తలు సహకరించాలని కోరారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శంకర్ నాయక్ విమర్శలు గుప్పించారు. రైతుకు ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+