మోడీ సూచనకు తలొగ్గిన కేసీఆర్: ఢిల్లీలోని నివాసంలో రెండు రోజులు రెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 'మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే రెస్ట్ తీసుకోండి' అంటూ ప్రధాని మోడీ చేసిన సూచనను టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పక పాటించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం గత వారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఆ సమావేశం జరుగుతుండగానే ఉండగానే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

తీవ్ర జ్వరం కారణంగా సమావేశం మధ్యలోనే ఆయన బయటకు వచ్చేశారు. అనంతరం సోమవారం తనను కలిసిన కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ... కేసీఆర్‌ను అత్యంత ఆప్యాయంగా పలుకరించారు.

డాక్టర్లను ఇంటికి పంపాలా?: కేసీఆర్ ఆరోగ్యంపై మోడీ ప్రత్యేక శ్రద్ధ!

ఆరోగ్యం కుదుటపడ్డాకే హైదరాబాదు వెళ్లాలని, అవసరమైతే ఎయిమ్స్ వైద్యులను కూడా కేసీఆర్ వద్దకు పంపిస్తానని మోడీ వ్యాఖ్యానించారు. 'అంతా ఓకేనా కేసీఆర్ జీ.. ఆరోగ్యం కుదుట పడిందా? రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి విశ్రాంతి తీసుకోండి కేసీఆర్ జీ. అవసరమైతే చెప్పండి... ఎయిమ్స్ వైద్యులను ఇంటికి పంపిస్తా. మొహమాటపడకండి' అని మోడీ కేసీఆర్‌తో అన్నారు.

KCR leaves for Hyderabad today

మోడీ ఆప్యాయ పలకరింపునకు కేసీఆర్ పులకించిపోయారు. ఈ సందర్భంగా మోడీకి సమాధానమిచ్చిన కేసీఆర్ 'హైదరాబాద్ నుంచి ఆయుర్వేద వైద్యుడిని పిలిపించుకుని మందులేసుకున్నాను' అని చెప్పారు. అనంతరం ప్రధాని సూచన మేరకు మంగళవారం మొత్తం రెస్ట్ తీసుకున్న సీఎం కేసీఆర్ బుధవారం కూడా ఢిల్లీలోనే విశ్రమించనున్నారు.

ఢిల్లీలో తన అధికారిక నివాసం 23, తుగ్లక్ రోడ్డు బంగ్లాలోనే మంగళవారం గడిపిన కేసీఆర్... పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలను మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన ఏ ఒక్కరికి కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. బుధవారం కూడా అక్కడే విశ్రాంతి తీసుకోనున్న కేసీఆర్ ఈరోజు రాత్రికి హైదరాబాదు బయల్దేరనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on Monday enquired Telangana CM K Chandrasekhasr Rao's health.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి