పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ట్రాప్ - కీలక పరిణామాలు..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. అయిదు స్థానాలకు కాంగ్రెస్ - మిత్రపక్షాలకు నాలుగు, బీఆర్ఎస్ ఒక సీటు దక్కుతుంది. అయితే, అయిదుగురు కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తే పోలింగ్ అనివార్యం. ఇదే లెక్కతో బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ
తెలంగాణలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు రేపటితో నామినేషన్ గడువు ముగియుంది. కాంగ్రెస్ కు నాలుగు స్థానాలు, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది. కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకటి గతం లో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి కేటాయించనున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో అభ్యర్ధుల కోసం రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీ పర్యటన రద్దయింది. పార్టీ నేతల తో హైకమాండ్ చర్చలు చేస్తోంది. ఈ సాయంత్రం లోగా కాంగ్రెస్ అభ్యర్ధులు ఖరారు కానున్నారు. అటు బీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్ధుల పైన కీలక మంత్రాంగం ప్రారంభించింది.

బీఆర్ఎస్ వ్యూహం
కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత కేసు సుప్రీంలో కీలక దశకు చేరింది. సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఫిక్స్ చేస్తూ... మరింత ఒత్తిడి పెంచేలా ఎమ్మెల్సీ ఎన్నికలను వినియోగించు కోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులను బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు గులాబీ పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు కేసీఆర్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.
కేసీఆర్ నిర్ణయం ఏంటి
రేపు(సోమవారం) ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు. ఈ రోజునే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి. ఇక, బీఆర్ఎస్ నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా, బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అందులో పదిమింది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 ఎమ్మె ల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. రెండో అభ్యర్థిని నిలబెడితే...పార్టీ గుర్తు పైన గెలిచిన వారికి విప్ జారీ చేసే అవకాశం వినియోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సత్యవత్ రాథోడ్‌తో పాటు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒక స్థానంకే పరిమితం అవుతారా.. రెండు స్థానాలకు పోటీ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications