కేసీఆర్ సంచలనం - BRS లో ఆ నేతల పదవులపై వేటు, వారికి సీట్లు ఇవ్వను..!!
మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకర ణాల వేళ.. కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా పార్టీ నేతలకు తన వైఖరి తేల్చి చెప్పారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి సీట్ల ఖరారు విషయంలోనూ తన ఆలోచనలు ఏంటో స్పష్టం చేసారు. నియోజకవర్గాల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఇక పార్టీలో ఎవరికి ప్రాధాన్య త ఉంటుందో తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పార్టీలో కొత్త రక్తం ఎక్కించే లక్ష్యంతో ఈ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. క్రియాశీలకంగా పని చేసే యువతకు, కష్టపడే నాయకులకు కొత్త కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర, జిల్లా కార్యవర్గ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ లైనుకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఇతర పార్టీలవైపు చూస్తూ.. ఆటో కాలు ఇటో కాలు అన్న చందంగా వ్యవహరించవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో ఉండదలుచుకుంటే ఉండండి.. లేదంటే, మీకు నచ్చిన పార్టీలోకి వెళ్లండని హెచ్చరించారు. అంతేకానీ, ఆటో కాలు ఇటో కాలు వేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో మీరు వేసే డ్రామాలు ఇక్కడ పని చేయవని... పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయాలని నిర్దేశించారు. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇకపై మీ ఆటలు సాగవని ఘాటుగా హెచ్చరించారు.













Click it and Unblock the Notifications