వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాల ఊహకందని కేసీఆర్ రాజకీయం .. సంచలన ప్రకటనల వెనుక 'ముందస్తు' చాణక్యం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? మరోమారు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతో ఉన్నారా? సంచలన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దృష్టి వాటిపై మళ్లే విధంగా చేసి ప్రజా వ్యతిరేకతను దూరం చేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటనల వెనుక మతలబుపై చర్చ

అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటనల వెనుక మతలబుపై చర్చ


తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా వ్యూహాత్మకంగా చేస్తారనేది జగమెరిగిన సత్యం. అందుకే రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మరోమారు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కెసిఆర్ ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను చిత్తు చేసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన, దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాలలో అమలు చేస్తామన్న ప్రకటన వెనుక మతలబు అదే అన్న చర్చ జోరుగా సాగుతోంది.

కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్

కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టాలని, ఈసారి ఎన్నికల్లో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని అటు బిజెపి రథసారథి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి, ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, నిరసనలు ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నారు. నిత్యం సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇక ప్రతిపక్షాల దూకుడును గమనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు సేకరించే పనిలో ఉన్నారు.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ముందస్తుకు కేసీఆర్.. నిర్ణయాలపై రాజకీయ వర్గాల దృష్టి

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ముందస్తుకు కేసీఆర్.. నిర్ణయాలపై రాజకీయ వర్గాల దృష్టి

ఈ క్రమంలోనే మళ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని అభిప్రాయం బలంగా వినిపిస్తున్న సమయంలో తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వివిధ పధకాలను ప్రకటిస్తూ, పథకాల అమలుకు కేసీఆర్ చెబుతున్న గడువు ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేదిగా కనిపిస్తుంది. మూడు నెలల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని, 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కెసిఆర్ ప్రకటించడం కూడా అందులో భాగంగానే అని భావిస్తున్న పరిస్థితి ఉంది. జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా కెసిఆర్ దృష్టి సారించనున్నారు.

దళిత బంధుపై సంచలన ప్రకటన .. ప్రజలతో మైండ్ గేమ్

దళిత బంధుపై సంచలన ప్రకటన .. ప్రజలతో మైండ్ గేమ్

ఇదే సమయంలో దళిత బంధు పథకం విషయంలో కూడా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాలు చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలోనే దళిత బంధు పథకాన్ని వర్తింప చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు వచ్చే మార్చిలోపు మూడు వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని, కేవలం హుజురాబాద్ బై ఎలక్షన్స్ కోసమే దళిత బంధు తీసుకురాలేదని, ఈ స్కీమ్ ను రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు . వచ్చే బడ్జెట్ లో దళిత బంధు కోసం 20 వేల కోట్ల రూపాయలు పెడతామని, బడ్జెట్లోనే దళిత ఎంపవర్మెంట్ కోసం వెయ్యి కోట్లు పెట్టామని కెసిఆర్ పేర్కొన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే దళిత బంధు పథకాన్ని తాయిలంగా చూపించి దళిత బంధు కావాలా వద్దా అంటూ ప్రజలతో సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పోడు భూములకు గిరిజనులకు హక్కులు ఇస్తామన్న కేసీఆర్

పోడు భూములకు గిరిజనులకు హక్కులు ఇస్తామన్న కేసీఆర్

అంతేకాదు పోడు సాగు చేసుకుంటున్న ఎస్టీల నుండి తర్వాత అప్లికేషన్లు తీసుకొని వారికి పోడు భూములపై హక్కులు కల్పించే ప్రయత్నాలు మొదలుపెడతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అర్హులైన గిరిజనులకు మొదటిదశలో హక్కులు కల్పిస్తామని గిరిజనేతరులకు హక్కులు కల్పించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పోడు భూములపై హక్కులు కల్పించడం ద్వారా గిరిజన ఓటు బ్యాంకును కొల్లగొట్టే పని మొదలు పెట్టబోతున్నారన్న సంకేతం కనిపిస్తుంది. రాష్ట్రంలో అటవీ భూములలో పోడు చేస్తున్న వారికి చుక్కలు చూపించేలా,అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా అటవీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కెసిఆర్, ఇప్పుడు పోడు భూముల విషయంలో ఇంత సానుకూలంగా స్పందించడం వెనుక ముందస్తు ఎన్నికల వ్యూహం ఉందన్న చర్చ సాగుతుంది.

Recommended Video

అభివృద్దిలో తెలంగాణ దూసుకెళ్తోందన్న మంత్రి కేటీఆర్!! || Oneindia Telugu
 కేంద్రంలో భవిష్యత్ లో మనం శాసించే ప్రభుత్వమే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనల వెనుక ముందస్తు వ్యూహం

కేంద్రంలో భవిష్యత్ లో మనం శాసించే ప్రభుత్వమే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనల వెనుక ముందస్తు వ్యూహం

ఇదే సమయంలో కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వమే రావొచ్చు అంటూ, కేంద్రంలో మనకు చోటు దక్కవచ్చు అంటూ తాజాగా అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కాలంలో వరుసగా కెసిఆర్ చేస్తున్న ఢిల్లీ పర్యటనలు, సంచలన ప్రకటనలు, తీసుకొస్తున్న పథకాలు అన్నీ మళ్లీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారేమో అన్న అనుమానాలకు ఊతమిస్తోంది. ఇటీవల కాలంలో కేంద్రమంత్రులతో, ముఖ్యంగా అమిత్ షా తో సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఖాయమే అన్న భావనకు కారణమవుతున్నాయి. ఏది ఏమైనా మరోమారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ జండా ఎగరవేయడం కోసం, సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలకు ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

English summary
KCR mark politics started in Telangana for Early elections. The pre-strategy behind CM KCR Delhi tours, sensational announcements like jobs notification, dalith Bandhu scheme
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X