కేసీఆర్ రూ. 500 కోట్లతో బేరాలు.. తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరిలో రద్దు!: రేవంత్ షాకింగ్
హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్
హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని చెప్పారు. అంతేగాక, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలను కేసీఆర్ కొనుగోలుకు యత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్.

కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ రూ. 500 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న రేవంత్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి రూ. 500 ఆఫరిచ్చారని రేవంత్ ఆరోపించారు. తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని మండిపడ్డారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు.

బీఆర్ఎస్ సభకు కుమారస్వామి అందుకే రాలేదన్న రేవంత్
సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ తెలిపారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని.. ఇవాళ బీఆర్ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఖమ్మం సభ ప్రసంగాన్ని మొత్తం విన్నానని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్, ఆప్ నేతలు భాగస్వాములు అని రేవంత్ అన్నారు. ఎల్ఐసీ, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ నిర్మించిన కర్మాగారాలను మోడీ అమ్ముకుంటున్నారన్నారు. పార్లమెంటులో మోడీకి మద్దు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి మోడీతో కేసీఆర్ అంటకాగారన్నారు. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications