థర్డ్ ఫ్రంట్‌పై కెసిఆర్ దూకుడు: మమత బెనర్జీతో రేపే చంద్రశేఖర్ భేటీ

హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించిన తెలంగాణ సీఎం కెసిఆర్ సోమవారం నాడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం నాడు సమావేశం కానున్నారు. దేశంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను ముందుంటానని కెసిఆర్ ఇటీవలనే ప్రకటించారు.

దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని తెలంగాణ సీఎం కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అవే పాలనను అవలంభిస్తున్నాయని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ అభిప్రాయంతో ఉన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, బిజెపియేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కావడం వల్లే సాధ్యమౌతోందని కెసిఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం చర్చకు శ్రీకారం చుట్టనున్నారు.

మమత బెనర్జీతో భేటీ కానున్న కెసిఆర్

మమత బెనర్జీతో భేటీ కానున్న కెసిఆర్

తెలంగాణ సీఎం కెసిఆర్ మార్చి 19న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం కెసిఆర్ మమత బెనర్జీతో సమావేశం కానున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు గురించి బాబు మమతతో చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం బెంగాల్‌కు కెసిఆర్ బయలుదేరుతారు. మమత బెనర్జీతో రెండు గంటల పాటు సమావేశమైన తర్వాత అదే రోజు రాత్రి కెసిఆర్ హైద్రాబాద్‌కు తిరిగి వస్తారు.

మూడో ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనను స్వాగతించిన మమత

మూడో ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనను స్వాగతించిన మమత

తెలంగాణ సీఎం కెసిఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటననను పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతించారు. మూడో ఫ్రంట్ గురించి తెలంగాణ సీఎం ప్రకటించిన వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఫోన్ చేశారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఫోన్‌లో చర్చించారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణపై కెసిఆర్ మార్చి 19న మమతతో చర్చించనున్నారు.

మూడో ఫ్రంట్ ... ఫలితాలు

మూడో ఫ్రంట్ ... ఫలితాలు


తెలంగాణ సీఎం కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై పార్టీ నేతలతో తెలంగాణ సీఎం కెసిఆర్ శనివారం నాడు చర్చించినట్టు సమాచారం. ఇప్పటివరకు దేశంలో థర్ట్‌ఫ్రంట్ ఏర్పాటైన సమయంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు. థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో వచ్చిన ఫలితాలు దేశంలో ఆనాడు చోటు చేసుకొన్న రాజకీయ ఫలితాలపై పార్టీ నేతలతో బాబు చర్చించారు. రానున్న రోజుల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఏ రకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే దానిపై కూడ పార్టీ నేతలతో కెసిఆర్ చర్చించినట్టు సమాచారం.

పార్టీల మద్దతును కూడగడుతున్న కెసిఆర్

పార్టీల మద్దతును కూడగడుతున్న కెసిఆర్

దేశంలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం కెసిఆర్ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కెసిఆర్ కూడగట్టేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో మార్చి19న సమావేశం కానున్నారు. దేశంలోని ఇతర పార్టీల నేతలతో కూడ కెసిఆర్ త్వరలోనే చర్చించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+