రాజ్‌నాథ్‌కు కెసిఆర్ విభజన సమస్య, కేంద్రమే పరిష్కరించాలి, అందుకే అఫ్పు: వినోద్

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా విభజన సమస్యలను ఏకరువు పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు, విభజన హామీలు, ఉద్యోగుల విభజన, పెండింగులో ఉన్న అంశాలు, విభజన సమస్యలు, షెడ్యూల్ 9, 10 సంస్థలు, హైకోర్టు విభజన తదితరాల పైన రాజ్‌నాథ్‌తో కెసిఆర్ చర్చించారు. ఈ బేటీలో ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, డీజీపీ అనురాగ్ శర్మలు పాల్గొన్నారు.

భేటీ అనంతరం ఎంపీ వినోద్ విలేకరులతో మాట్లాడారు. తాము అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామన్నారు. ఈక్విటీ పెట్టే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అరుణ్ జైట్లీ అంగీకరించారని చెప్పారు.

KCR meets Rajnath Singh

గుజరాత్, తెలంగాణల రాష్ట్రాలకు మాత్రమే అప్పులు తెచ్చుకునే శక్తి ఉందని చెప్పారు. అభివృద్ధి కోసమే ఎఫ్ఆర్‌బిఎం పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో 13 జిల్లాలను పెంచుతున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రాల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు.

రాహుల్ గాంధీతో భేటీయైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక అభ్యర్థి ఖరారుపై చర్చించారు. వరంగల్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జీ వివేక్‌ను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది.

ఒకవేళ ఆయన కాదంటే కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్ అందరి అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారన్నారు. రేపు దిగ్విజయ్ హైదరాబాద్ వస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+