Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ ఢిల్లీలో ఓమాట.!గల్లీలో మరోమాట.!తిప్పికొట్టాల్సిందే.!బీజేపి శ్రేణులతో బండి సంజయ్.!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీ వంగుతుంటడని, ఇక్కడ దుంకుతుంటడని బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు. చంద్ర శేఖర్ రావు విధానాలకు కళ్లెం వేయకపోతే వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతాయని సంజయ్ ద్వజమెత్తారు. ఢిల్లీ బీజేపి నేతలకు వంగి వంగి దండాలు పెట్టే కేసీఆర్ తెలంగాణలో ఏదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటారని మండిపడ్డారు. ఇందిరా పార్క్ మహాధర్నాలో చంద్రశేఖర్ రావు బీజేపి మీద చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ పూర్తి తప్పుబట్టారు. చంద్రశేఖర్ రావును కట్టడచేసే అంశంలో మరింత దూకుడు పెంచాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు.

ఇది చాలదు.. ఇంకొంచే ఎక్కువ వేగం పెంచాలన్న బండి సంజయ్

ఇది చాలదు.. ఇంకొంచే ఎక్కువ వేగం పెంచాలన్న బండి సంజయ్

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేస్తూనే రైతు సమస్యల మీద ఫోకస్ పెంచాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలు వాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా తెలంగాణ రాష్ట్రం తగ్గించక పోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 20న జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కార్యచరణ రూపొందించారు. జిల్లా స్థాయిలో డిసెంబర్ 1 నుండి 15 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు, మండల స్థాయిలో డిసెంబర్ 16 నుండి 30 వరకు నిర్వహించాలని వారికి శిక్షణ ఇచ్చే వారికి ఈ నెల 24న శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని బండి సంజయ్ సూచించారు.

ఢిల్లీలో వంగుడు.. ఇక్కడ దుంకుడు.. కేసీఆర్ వైఖరిని ఎండగట్టాలన్న బీజేపి ఛీఫ్

ఢిల్లీలో వంగుడు.. ఇక్కడ దుంకుడు.. కేసీఆర్ వైఖరిని ఎండగట్టాలన్న బీజేపి ఛీఫ్

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు సభలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో నవంబర్ 27, 28 న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. బిజెపి అనుబంధ మోర్చాలు అనేక కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారుని, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల సంజయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అన్ని విభాగాలు కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.

రైతుల పట్ల కేసీఆర్ మోండి వైఖరి.. ధాన్యం కొనకుండా నాటకాలాడుతున్న సీఎం

రైతుల పట్ల కేసీఆర్ మోండి వైఖరి.. ధాన్యం కొనకుండా నాటకాలాడుతున్న సీఎం

ఆరుగాలం పండించి అందరికీ అన్నం పెట్టే రైతన్న లు కల్లాలలో, మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి అమ్ముకుంటే తమ జీవితాన్ని గడుపు కోవచ్చు అని భావిస్తున్న తరుణంలో వర్షాల కారణంగా ధాన్యం కుప్పలు తడిసి కాలువల్లో పోతుంటే ఆవేదనగా చూస్తున్నారు తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని రైతులకు అండగా బిజెపి పార్టీ శ్రేణులు ఉండాలని వారికి బాసటగా నిలవాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ మార్కెట్ యార్డ్ లు, ఐకేపీ సెంటర్లలో ఉన్న ధ్యాన్యాన్ని పరిశీలించాలని కోరారు.

ఇక కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం.. వేగం పెంచాలన్న బండి సంజయ్

ఇక కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం.. వేగం పెంచాలన్న బండి సంజయ్

మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి 30 రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల అమ్ముకోలేక నిస్సహాయ స్థితిలో ఉండి నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. అంతే కాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దాడులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెచ్చ గొడుతున్న వ్యాఖ్యలు, రాజకీయ పరిస్థితుల పైన తీవ్రంగా స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని సంజయ్ వివరించారు. చంద్రవేఖర్ రావు తప్పుడు ప్రచారం పట్ల, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆధారాలు లేని ఆరోపణలపట్ల అప్రమత్తంగా ఉంటూ సమర్దవంతంగా తిప్పి కోట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+