ఎన్నారైలకు పిలుపు: ‘డెక్కన్ ఆటో’ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనేకులు ముందుకొస్తున్నారని కెసిఆర్ చెప్పారు. శనివారం మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో సిఎం సుడిగాలి పర్యటన జరిపి హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కదిలిరావాలని ప్రవాస తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. పరిశ్రమల కోసం రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులోకి తెచ్చామని, పారదర్శకంగా, జీరో కరప్షన్ పద్ధతిలో 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

ముందుగా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులోని డెక్కన్ ఆటో లిమిటెడ్ పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో ఉత్పత్తి చేసిన మూడు రకాల బస్సులను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. గతంలో పరిశ్రమలకు తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండేదని, గత ఏడాది కొంతమేరకు సమస్య తలెత్తినా ఈసారి అలా జరగడం లేదన్నారు.

ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎన్‌ఆర్‌ఐ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ బస్సు పరిశ్రమను నెలకొల్పడం అభినందనీయమన్నారు. 1997లో తాను రవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శిరిడి వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సులను తయారు చేయించామని, కానీ అప్పటికి ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిందని చెప్పడానికి డెక్కన్ ఆటో కర్మాగారం తయారు చేసిన బస్సులే నిదర్శనమన్నారు.

డెక్కన్ ఆటో బస్సులను త్వరలోనే టిఎస్‌ఆర్టీసీకి సమకూర్చుతామన్నారు. అత్యాధునిక వసతులతో మార్కెట్లోకి వచ్చిన డెక్కన్ ఆటో సంస్థకు చెందిన మూడు రకాల బస్సులను గోవా, చండీగఢ్, పాండిచ్చేరి ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులకు సిఎం చేతులమీదుగా తాళాలను అందజేసారు. అంతకుముందు పటాన్‌చెరులోని హజ్రత్ సయ్యద్ మురదలిషా సాహెబ్ దర్గాను సిఎం సందర్శించి చాదర్‌ను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు.

కెసిఆర్

కెసిఆర్

నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

కొత్త పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనేకులు ముందుకొస్తున్నారని కెసిఆర్ చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

శనివారం మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో సిఎం సుడిగాలి పర్యటన జరిపి హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు.

కెసిఆర్

కెసిఆర్

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కదిలిరావాలని ప్రవాస తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు చేయూతనివ్వాలని ఆయన కోరారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమల కోసం రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులోకి తెచ్చామని, పారదర్శకంగా, జీరో కరప్షన్ పద్ధతిలో 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ముందుగా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులోని డెక్కన్ ఆటో లిమిటెడ్ పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో ఉత్పత్తి చేసిన మూడు రకాల బస్సులను సిఎం కెసిఆర్ ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

గతంలో పరిశ్రమలకు తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండేదని, గత ఏడాది కొంతమేరకు సమస్య తలెత్తినా ఈసారి అలా జరగడం లేదన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రస్తుతం 4320 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి అవుతుందని, భవిషత్‌లో విద్యుదుత్పత్తిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. 25 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టేందుకు 91.5 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసిన 17 కంపెనీలకు 11 రోజుల్లో అన్ని పనులు పూర్తిచేసి అనుమతులు ఇప్పించామన్నారు. మరికొన్ని దరఖాస్తులు సైతం వస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని చకచకా పూర్తి చేసేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసిన పక్షం రోజుల్లోనే అనుమతులు ఇప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ఏ అధికారి జాప్యం చేసినా జరిమాన విధిస్తామని హెచ్చరించారు.

కెసిఆర్

కెసిఆర్

ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎన్‌ఆర్‌ఐ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ బస్సు పరిశ్రమను నెలకొల్పడం అభినందనీయమన్నారు

కెసిఆర్

కెసిఆర్

1997లో తాను రవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శిరిడి వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సులను తయారు చేయించామని, కానీ అప్పటికి ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిందని చెప్పడానికి డెక్కన్ ఆటో కర్మాగారం తయారు చేసిన బస్సులే నిదర్శనమన్నారు.

కెసిఆర్

కెసిఆర్

డెక్కన్ ఆటో బస్సులను త్వరలోనే టిఎస్‌ఆర్టీసీకి సమకూర్చుతామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

అత్యాధునిక వసతులతో మార్కెట్లోకి వచ్చిన డెక్కన్ ఆటో సంస్థకు చెందిన మూడు రకాల బస్సులను గోవా, చండీగఢ్, పాండిచ్చేరి ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులకు సిఎం చేతులమీదుగా తాళాలను అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+