హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మతాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు. జెరూసలెం వెళ్లాలని చాలా మంది అనుకుంటారు కానీ, ఆర్థిక సమస్యలతో వెళ్లలేరని మతపెద్దలు చెప్పారన్నారు.

సిమెట్రీల కోసం క్రిస్టియన్లకు స్థలాలు కావాలని అడిగారని, అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఇస్తామని, లేకుంటే కొనుగోలు చేసి ఇస్తామని ప్రకటించారు. కొన్ని అంశాల్లో మినహాయింపులు అడిగారన్నారు. దీన్ని ప్రభుత్వం 100శాతం పరిశీలిస్తుందని చెప్పారు.

క్రిస్టియన్ల సమస్యలు నాకు తెలుసని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయన్నారు. ఏదైనా మాట్లాడితే వెంటనే ఎన్నికల కమిషన్ నోటీసులిస్తుందని, సమస్యలపై చర్చించేందుకు జనవరి మొదటివారంలో బిషప్‌లు, పాస్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

ఇది కొత్త రాష్ట్రమని, నిలిచి గెలవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఏకకంఠంతో మనందరం పనిచేయాలని సూచించారు. అభివృద్ధి చెందాలి అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో క్రిస్టియన్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దళిత క్రిస్టియన్ల సమస్యలు తనకు తెసునని చెప్పారు.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు వారి సమస్యలు ప్రస్తావిస్తారని, తానే స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. అందరం సంతోషంగా క్రిస్మస్ జరుపుకుందామని అన్నారు. ఈ సంవత్సరం క్రిసమస్ వేడుకల్లో పాల్గొనలేక పోతున్నానని సీఎం తెలిపారు.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

ప్రతి సంవత్సరం నేను మెథడిస్ట్ చర్చ్‌కు వెళ్తుంటాను. అయితే ఈ సంవత్సరం యాగం ఉండటం వల్ల వెళ్లలేకపోతున్నాను. నా తరఫున నా కుటుంబ సభ్యులు వెళ్తారు. అందరికీ జీసెస్ కరుణ ఉండాలి. ఆత్మగౌరవంతో బతుకుదాం.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు, అన్ని మత విశ్వాలను నమ్మే ప్రజలందరూ గౌరవింపబడి, చిరునవ్వులతో, ఆనందంగా, సరదాగా ఉండటమే తెలంగాణ రాష్ట్ర లక్ష్యం. ఎక్కువ, తక్కువ భేదభావాలు లేకుండా, సమానంగా గౌరవించినప్పుడు తెలంగాణ మంచి రాష్ట్రం అవుతుంది. మరోసారి రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని సీఎం పేర్కొన్నారు.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించడం కొత్తదేమీ కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో అదే చేస్తున్నాం. సర్వమతాల ప్రజలు సంతోషంగా బతకాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని ఆనాడే చెప్పాను. నాడు చెప్పిందే ఇప్పుడు చేసి చూపుతున్నాం అని అన్నారు.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడుగురికి నగదు పురస్కారంతో పాటు శాలువా, మెమెంటోను సీఎం చేతుల మీదుగా అందజేశారు. వీరిలో రోజమ్మ మంగళసిరి, సుశీల, జోసెబ్, సుకుమార్, మార్క్ పోలెనిస్, కృపయ్య, బాబూరావు ఉన్నారు. ఐదువేల మందితో కలిసి సీఎం క్రిస్మస్ విందు భోజనం చేశారు.

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

సానుకూలంగా పరిశీలిస్తాం: క్రిస్మస్ వేడుకల్లో మనవడితో కలిసి కేసీఆర్

కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఐఏఎస్‌లు రేమండ్ పీటర్, ప్రదీప్‌చంద్ర, ఉమర్ జలీల్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే రాజయ్య, బిషప్‌లు తుమ్మబాల, జేమ్స్, థామస్, బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.

English summary
KCR Participated Christmas Celebrations at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X