Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ ఏజెంట్ కేసీఆర్.!తమిళనాడు పర్యటన రహస్యం బహిర్గతం చేయాలన్న రేవంత్.!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కారణమని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రశేఖర్ రావు రాజకీయ, మతపరమైన పర్యటనల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

 తెలంగాణలో పెరుగుతున్న రైతు మరణాలు.. అప్పుల ఊబిలో రైతాంగం..

తెలంగాణలో పెరుగుతున్న రైతు మరణాలు.. అప్పుల ఊబిలో రైతాంగం..

రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణలోని లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులు భారీ అప్పుల్లో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అధికారులు రైతులు పండించిన పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడం, కనీస ధర అందించకపోవడంతో రైతులు చేసిన అప్పులను తీర్చలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికే యాసంగి పంటను పండించడానికి వనరుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే అవకాశం లేకపోవడంతో, చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరి కొంతమంది తీవ్ర ఆందోళనలో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో ప్రమాదపు అంచున ఉన్నారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

చంద్రశేఖర్ రావు తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తమిళనాడు ఆలయాల్లో పూజలు చేసేందుకు వెళ్లారా, లేక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో మంతనాలు జరిపేందుకు వెళ్లారా స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేసారు. నేరుగా సీఎం స్టాలిన్‌ను కలిసేందుకే అక్కడికి వెళ్లారా లేక బీజేపీ ఏజెంట్‌గా బట్టబయలు అవుతుందని ఆలయాల సందర్శన పేరుతో వెళ్లారా అనేది చంద్రశేఖర్ రావు స్పష్టత ఇవ్వాలని అన్నారు. తమిళనాడు సీఎంను కలుస్తానని సాకు చూపుతూ ఆలయాల సందర్శన డ్రామా ఆడుతున్నారని తన పర్యటన రాజకీయ పరమైనదా, మత పరమైనదా అనేది కేసీఆర్‌ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 కేంద్ర రాష్ట్ర డ్రామాల్లో రైతులు బలి.. రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ బాద్యత వహించాలన్న రేవంత్ రెడ్డి

కేంద్ర రాష్ట్ర డ్రామాల్లో రైతులు బలి.. రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ బాద్యత వహించాలన్న రేవంత్ రెడ్డి

ప్రభుత్వం వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేకపోవడంతో రైతాంగ పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల కష్టాలపై రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రముఖ ప్రాంతీయ దినపత్రిక వార్తా పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్స్‌ను కూడా ఆయన జత చేశారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల రైతులు తమ సాగును వదిలివేయడం వల్ల రైతాంగం దెబ్బతిన్న పరిస్థితిలో ఉందని అన్నారు. దీని ఫలితంగా, గత రెండున్నర నెలల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్‌ వివరించారు.

 కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు హాస్యాస్పదం.. సొంతపార్టీ మీద ప్రజల విశ్వాసం పోతోందని రేవంత్ ఎద్దేవా

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు హాస్యాస్పదం.. సొంతపార్టీ మీద ప్రజల విశ్వాసం పోతోందని రేవంత్ ఎద్దేవా

భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సీఎం చంద్రశేఖర్ రావు మళ్లీ తెరలేపారని వస్తున్న వార్తలను రేవంత్‌ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఆలోచించే పరిస్థితిలో చంద్రశేఖర్ రావు లేరని, తెలంగాణలో తన సొంత పార్టీ భవిష్యత్తుపై చంద్రశేఖర్ రావు ఆందోళన చెందుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రజాగ్రహానికి గురవుతోందని, త్వరలోనే టీఆర్‌ఎస్‌లో అంతర్గత తిరుగుబాటు రావచ్చునని 2023లో అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, 2024లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ఉనికే ఉండదని అస్తిత్వం లేకుండా పోతుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు.

 ప్రధాని మోదీకి కేసీార్ ఏజెంట్‌.. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కేసీఆర్ ది హైప్‌ మాత్రమే

ప్రధాని మోదీకి కేసీార్ ఏజెంట్‌.. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కేసీఆర్ ది హైప్‌ మాత్రమే

అంతే కాకుండా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆలోచలనే చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటైతే కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీయేత పార్టీ ఓట్లను చీల్చేందుకు, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని నిప్పులు చెరిగారు. చంద్రశేఖర్ రావు, ప్రధాని మోదీకి ఏజెంట్‌ అనే విషయాన్ని సెక్యులర్‌ పార్టీలన్నీ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రశేఖర్ రావును ఎవరూ నమ్మవద్దని కోరారు. అయితే, బీజేపీ అనుకూల మీడియా మద్దతుతో చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో తన ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి హైప్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+