సీఎం కేసీఆర్ శుభవార్త.. ఆగస్టు 15వ తేదీ నుంచి..!!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నామని, ప్రస్తుతం 36లక్షల మందికి ఇస్తున్నట్లు వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ అందుతుందన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వీటిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్ ఇస్తామని, 12 వేలమంది డయాలిసిస్ పేషెంట్లకు ప్రతి నెలా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వడంతోపాటు, అనాథ పిల్లలను రాష్ట్ర పిల్లలుగా గుర్తించి వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
57 సంవత్సరాల వయసున్నవారికి పెన్షన్ ఇస్తామని, కరోనా, ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పుడు లిస్ట్ తయారు చేశామని, 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. బోదకాలు ఉన్నవారికి, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు కూడా ఇవ్వనున్నామని, సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేస్తామన్నారు. అనాథ పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు విద్య అందించడంతోపాటు ఉద్యోగాల్లోను రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

బలమైన రాష్ట్రాలుంటేనే బలమైన భారత దేశం ఉంటుందని, కానీ దేశంలో గాలి తప్ప అన్నింటిపై పన్నులు వేశారని మండిపడ్డారు. దౌర్భాగ్యకరంగా దేశంలో పన్నుల విధానం ఉందన్నారు. స్మశానాలపై పన్ను విధించడమేంటని ప్రశ్నించారు. హనుమాన్ జయంతి రోజు ఢిల్లీ నడివీధుల్లో కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారని, ఇదేనా నీతి ఆయోగ్ ఇచ్చే సందేశం అని కేసీఆర్ ప్రశ్నించారు. మేం చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం అనే పరిస్థితికి వచ్చిందని, నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవరికీ ప్రమేయం ఉండదని, అందులో ఏం చేస్తారో? ఏం రూపొందిస్తారో ఎవరికీ అర్థం కావడంలేదన్నారు.












Click it and Unblock the Notifications