మహిళలతో ముచ్చటించిన సిఎం కెసిఆర్(పిక్చర్స్)
వరంగల్: సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. గురువారం వరంగల్‌లోని మురికివాడల్లో పర్యటించి పేదల సాధకబాధకాలు తెలసుకున్న కెసిఆర్ శుక్రవారమూ దాన్ని కొనసాగించారు. శని, ఆదివారాలు కూడా ఇక్కడే ఉంటానని, సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పండంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు వరంగల్ నుండే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. జనవరి 11న నగరంలోని మురికివాడల్లో 1ప్లస్ 1 కింద అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ఖర్చులతోనే ఇళ్లు నిర్మించి నాలుగు నెలల్లో గృహప్రవేశాలు చేయిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. హోం స్టేట్ చట్టం కింద హక్కుపత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు.
శుక్రవారం నగరంలోని దీనదయాళ్ కాలనీ, ప్రగతినగర్ కాలనీ, అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనదయాళ్ కాలనీలోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలస్థలంలో మోడల్ కాలనీని నిర్మిస్తామన్నారు. ఇక్కడఉన్న స్థలాన్ని లేఅవుట్ చేసి రెండురోజుల్లో పనులు ప్రారంభిస్తానన్నారు. తాను మరోరోజు కూడా ఇక్కడే ఉండి ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసే వెళ్తానన్నారు.
అందుకోసం స్థల లేఅవుట్ చేసేందుకు హైదరాబాద్ నుండి 50 మంది ఇంజనీర్లను వరంగల్‌కు రప్పిస్తున్నానని, మొదటి విడత ఆరు మురికివాడల్లో నాలుగు నెలల్లో ఇళ్లు నిర్మించి గృహప్రవేశాలు చేయిస్తానన్నారు. ఇందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎవరు ఆక్రమించుకున్న స్థలంలో వారు ఉండి ఫోటో దిగి అధికారులకు ఇచ్చినట్లయితే అదే స్థలంలో వారికి రెండు బెడ్‌రూంలు, అటాచ్ బాత్‌రూం, హాల్, కిచెన్‌తో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తానన్నారు.

కెసిఆర్
సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు.

జీయర్ స్వామికి పాదాభివందనం
గురువారం వరంగల్‌లోని మురికివాడల్లో పర్యటించి పేదల సాధకబాధకాలు తెలసుకున్న కెసిఆర్ శుక్రవారమూ దాన్ని కొనసాగించారు.

భద్రత
శని, ఆదివారాలు కూడా ఇక్కడే ఉంటానని, సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పండంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

ప్రజల మధ్యలో..
సిఎం కెసిఆర్ కూర్చునేందుకు సాయం చేస్తున్న సిబ్బంది, ఎంపి కడియం శ్రీహరి.

ప్రజలతో ముచ్చటిస్తూ..
జనవరి 11న నగరంలోని మురికివాడల్లో 1ప్లస్ 1 కింద అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ఖర్చులతోనే ఇళ్లు నిర్మించి నాలుగు నెలల్లో గృహప్రవేశాలు చేయిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రజలతో కెసిఆర్
హోం స్టేట్ చట్టం కింద హక్కుపత్రాలు కూడా అందజేస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు.
అంతేకాకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వమే నల్లా మంజూరు చేస్తుందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ కాలనీలను ధనవంతుల కాలనీలకు దీటుగా తీర్చిదిద్దుతామని, అందమైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యంతోపాటు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు. అర్హులైన వారికెవరికైనా ప్రభుత్వ పథకాలు అందనిపక్షంలో వారు కూడా ఇంటివద్దే ఉండి అధికారులతో రేషన్‌కార్డు, పింఛన్ పథకాన్ని మంజూరు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో దాదాపు 178 మురికివాడలు ఉన్నాయని, రానున్న మూడేళ్లలో దశలవారీగా మురికివాడలన్నీ మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు.












Click it and Unblock the Notifications