వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మురికివాడల్లో కల్లు దావత్ అడిగిన కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ నాలుగు నెలల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గరువారం వరంగల్‌లో అన్నారు.

రాత్రి నగరంలోని గిరిప్రసాద్ కాలనీ, లక్ష్మిపురం, సాకరాసికుంట కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. నిరుపేదలకు నాలుగు నెలల్లోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని, గృహ ప్రవేశానికి కూడా తానే వస్తానని చెప్పారు. అప్పుడు తనకు కల్లుతో పాటు మంచి దావత్ ఇవ్వాలన్నారు. అయితే గుడుంబాతో మాత్రం కాదన్నారు.

స్తీల్లో అర్హులైన వారందరికీ కార్డులు, పెన్షన్లు ఇచ్చేదాకా వరంగల్‌ నుంచి కదిలేది లేదని కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని అర్హతలున్నా తమకు కార్డులు అందలేదన్న జనం ఫిర్యాదుపై స్పందించారు. కేసీఆర్ వరంగల్‌లోని మురికివాడల్లో పర్యటించారు. కంప్యూటర్‌లో డేటా వల్లే సమస్య ఉందన్న అధికారులపై ఆగ్రహించారు. వరంగల్‌ బస్తీల్లో శుక్రవారం సర్వే చేసి అర్హులను గుర్తించాలని ఆదేశించారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న అర్హులైన ప్రతిఒక్కరికీ నాలుగు నెలల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

గురువారం రాత్రి నగరంలోని గిరిప్రసాద్ కాలనీ, లక్ష్మిపురం, సాకరాసికుంట కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు నాలుగు నెలల్లోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానన్నారు.

కేసీఆర్

కేసీఆర్

గృహప్రవేశానికి కూడా తానే వస్తానని, అప్పుడు తనకు కల్లుతో పాటు మంచి దావత్ ఇవ్వాలన్నారు. అయితే గుడుంబాతో మాత్రం కాదన్నారు.

కేసీఆర్

కేసీఆర్

పది రోజుల్లోనే ఈదిశగా పనులను ప్రారంభించి నాలుగు నెలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ఆయా కాలనీవాసులు సహకరించాలని కోరారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రజలే తనకు దేవుళ్లని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతానన్నారు. ఇక నుండి మురికి కాలనీలన్నింటినీ ఆదర్శ కాలనీలుగా మారుస్తానని తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

డబుల్ బెడ్‌రూంతోపాటు అటాచ్ బాత్‌రూం నిర్మించి హాల్, కిచెన్‌తో కలిపి రిజిస్ట్రేషన్ మరీ అందిస్తామన్నారు. ఇల్లు, జాగలేని పేదవాడు ఉండకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

కొన్ని సంవత్సరాలుగా నగరంలోని మురికి కాలనీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయని, వీటన్నింటిని త్వరలోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన పర్యటన మరో రోజు పొడగించుకొని మూడు రోజులు ఇక్కడే ఉంటానని తెలిపారు. అధికారులు కంప్యూటర్ల పేరుతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు.

కేసీఆర్

కేసీఆర్

కాలనీలో ఎక్కడ తిరిగినా కూడా అనేక సమస్యలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా నిరుపేదలు గుడిసెల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారని, వీరందరికి త్వరలోనే విముక్తి కలిపిస్తానన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

సూరత్‌ను తలదన్నేలా టెక్స్‌టైల్‌ పార్క్‌ టెక్స్‌టైల్‌ ఇండసీ్ట్రకి పెట్టింది పేరైన సూరత్‌ను తలదన్నేలా వరంగల్‌లో పెద్ద ఎత్తున టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

కేసీఆర్

కేసీఆర్

ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సూరత్‌కు వెళ్లి అధ్యయనం చేశారని, తమిళనాడులోని తిరుపూర్‌లోనూ పరిశీలిస్తారని తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

కేసీఆర్‌కు కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి సమస్యలతో స్వాగతం పలికారు. కేసీఆర్ పర్యటనలో డిప్యూటీ సిఎం రాజయ్య, ఎమ్మెల్యే కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేష్, ఎంపి సీతారాం నాయక్, కలెక్టర్ కిషన్, కమిషనర్ సువర్ణపాండదాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao has asked the officials to reorient themselves to work for the welfare of the people as many complained that they did not get pensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X