ఢిల్లీలో కేసీఆర్ 'రాజశ్యామల యాగం': బీఆర్ఎస్ జాతీయవిధానం ప్రకటనపై ఉత్కంఠ!!

భారత రాష్ట్ర సమితి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడానికి, జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అంతేకాదు రాజ శ్యామల యాగం నిర్వహించనున్నారు.

ఢిల్లీలో కేసీఆర్ 'రాజశ్యామల యాగం'

ఢిల్లీలో కేసీఆర్ 'రాజశ్యామల యాగం'

జాతీయ రాజకీయాల్లో పార్టీ అడుగు పెట్టిన క్రమంలో ఢిల్లీ కేంద్రంగా డిసెంబరు 14వ తేదీన ఎస్పి రోడ్ లో బీఆర్ ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టిఆర్ఎస్ జాతీయ విధానాన్ని, బి ఆర్ ఎస్ జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో పార్టీ అడుగు పెట్టిన సమయంలో సీఎం కేసీఆర్, డిసెంబర్ 13 మరియు 14 తేదీల్లో న్యూఢిల్లీలో 'రాజశ్యామల యాగం' నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

గతంలోనూ కేసీఆర్ యాగాలు.. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం కేసీఆర్ యాగం

గతంలోనూ కేసీఆర్ యాగాలు.. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం కేసీఆర్ యాగం

గతంలో డిసెంబర్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు నవంబర్ నెలలో తన ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ రాజ శ్యామల యాగం చేశారు. ఆ తర్వాత రెండవ సారి ముఖ్యమంత్రి అయిన క్రమంలో 2019 జనవరిలో ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగం చేశారు. ప్రస్తుతం టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న సమయంలో సీఎం కేసీఆర్ రాజ శ్యామల యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను చూడడానికి ఇప్పటికే జోగినిపల్లి సంతోష్ కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు ఢిల్లీకి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాజశ్యామల యాగం

జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాజశ్యామల యాగం

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ యాగం నిర్వహించి, పార్టీ కార్యాచరణను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14 వ తేదీన జరిగే టిఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు పార్టీని ఏ విధంగా విస్తరించాలన్న దానిపైన ఢిల్లీలో వారం రోజుల పాటు కేసీఆర్ మకాం వేసి చర్చించనున్నారు.

న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో శాశ్వత కార్యాలయం పూర్తికాకపోవడంతో, ప్రస్తుతం సర్దార్ పటేల్ రోడ్ లో అద్దెకు తీసుకొని బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి బి ఆర్ ఎస్ కార్యాలయ శాశ్వత భవనం పూర్తవుతుందని భావిస్తున్నారు.

పార్టీ విస్తరణ పనులు మొదలుపెట్టిన గులాబీ బాస్

పార్టీ విస్తరణ పనులు మొదలుపెట్టిన గులాబీ బాస్


వారం రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ఉన్న సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంస్థలతో సమావేశమై బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా పాగా వేయాలని భావిస్తున్న కేసీఆర్, అక్కడ బిఆర్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. విజయవాడలోనూ బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి భూముల కోసం ఆ పార్టీ నేతలు గాలిస్తున్నారు. త్వరలోనే ముంబై, బెంగళూరులలో కార్యాలయాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్

2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్

ఇక పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 2024 లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారిస్తున్న బీఆర్ఎస్, 2023 ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక వంటి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తుంది. తనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలలో ముందుకు వెళ్లనున్నారు. డిసెంబర్ 17వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల నగారా మోగించనున్నారు. కెసిఆర్ ఫర్ ఇండియా, దేశ్ కి నేత కెసిఆర్, కిసాన్ కి భరోసా కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ వంటి నినాదాలతో దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+