కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు
తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.

మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం
ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి" అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.
కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు
కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన, వెయ్యి రోజుల పాలనపై చర్చ జరపాలని సవాలు విసిరారు.
తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానన్నారు.
మూడేళ్ళలో ఏ మాత్రం ప్రజల కోసం పని చేయని కేసీఆర్
కుటుంబ సభ్యులకు కాకుండా కార్యకర్తలకు, వివిధ వర్గాలకు పదవులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని, తమ ప్రభుత్వం చెరువులు కాపాడుతూ, పేదలకు నగరంలోనే ఇళ్లు నిర్మిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు మూడేళ్ళలో ఏ మాత్రం ప్రజల కోసం కేసీఆర్ పని చెయ్యలేదని సీఎం రేవంత్ టార్గెట్ చేసి కార్యకర్తలకు ర్యాలీలకు పిలుపునివ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కొనసాగుతుంది.













Click it and Unblock the Notifications