వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ ప్రక్షాళనే! మొత్తం ప్రైవేటీకరించం, 3 రకాలుగా విభజన: కేసీఆర్ సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, అది వివేకమైన చర్య కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ విధానంపై సుమారు నాలుగు గంటలపాటు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రం 'మెఘా'వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్రాష్ట్రం 'మెఘా'వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్

ఆర్టీసీ సమ్మెపై సునీల్ శర్మ అందించిన నివేదికపై సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం వివేకమైన చర్య కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని చెప్పారు.

మూడు రకాలుగా విభజన

మూడు రకాలుగా విభజన

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తామని చెప్పారు. ఇందులో 50శాతం బస్సులు పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయని, 30శాతం బస్సులు అద్దెకు తీసుకుని వాటి పర్యవేక్షణ ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు. ఇక మరో 20శాతం బస్సులు పూర్తిగా ప్రైవేటు వారికేనని తెలిపారు.

ప్రైవేటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలతో సమానం

ప్రైవేటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలతో సమానం

ఆర్టీసీ కార్మిక సంఘాల అతి ప్రవర్తన వల్లే ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని సీఎం అన్నారు. తాము ఎవరినీ డిస్మిస్ చేయలేదని.. గడువులోగా విధుల్లో చేరకుండా వారికి వారే తప్పుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
ఆర్టీసీలో మొత్తం 5200 బస్సులు, 30శాతం అద్దె బస్సులు నడుపుతామని చెప్పారు. ఇక మిగిలిన 20శాతం మొత్తం ప్రైవేటు బస్సులేనని సీఎం తెలిపారు. అయితే, ఆర్టీసీ ఛార్జీలు, ప్రైవేటు ఛార్జీలు సమానంగా ఉంటాయని కేసీఆర్ చెప్పారు.

ఆర్టీసీ సిబ్బంది ప్రస్తుతం 1200 మాత్రమే

ఆర్టీసీ సిబ్బంది ప్రస్తుతం 1200 మాత్రమే

ఆర్టీసీ సంఘాలు తాము ఎక్కిన కొమ్మను తామే నరుక్కుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది కేవలం 1200 మందేనని అన్నారు. తాము ఎవరినీ డిస్మిస్ చేయలేదని.. వారంతా వారే తప్పుకున్నారని చెప్పారు.
సమ్మె ఉధృతం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

యునియనిజం ఉండదు.. ప్రక్షాళనే..

యునియనిజం ఉండదు.. ప్రక్షాళనే..

ఇక ఆర్టీసీలో యూనియనిజం ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాయితీ బస్ పాస్‌లు నడుస్తాయని అన్నారు. సబ్సిడీలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జనం ప్రశంసిస్తున్నారని అన్నారు. ఆర్టీసీని క్రమశిక్షణతో నడిపి లాభాల బాట పట్టిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అంతేగాక, వచ్చే లాభాల్లో కార్మికులకు బోనస్ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. కొత్త నియామకాలపై కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

English summary
Telangana CM KCR response on TSRTC privatisation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X