అసెంబ్లీలో రచ్చ చేయవద్దు!: ప్రజా సమస్యలపైనే ఫోకస్..: కేసీఆర్
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ రచ్చకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండటానికి.. సభ్యులకు దీనిపై ముందస్తుగానే సూచన చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయపరమమైన రచ్చకు తావివ్వకుండా.. వీలైనంత మేర ప్రజా సమస్యలపై చర్చ జరగే రీతిలో సభలు జరగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయా శాఖల సంబంధిత మంత్రులంతా నివేదికలు తెప్పించుకుని అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని, సభ్యులు అడిగే ప్రశ్నలకు పూర్తిస్థాయి సమాధానం ఇచ్చేలా సన్నద్దం కావాలని కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది.

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాఖలకు సంబంధించి ప్రతీ సమాచారంపై మంత్రులంతా స్పష్టమైన అవగాహన కలిగి ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. అలాగే సభ్యులు ఇచ్చే విలువైన సూచనలను స్వీకరించాలని చెప్పుకొచ్చారు.
రాజకీయాల కోసం సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయవద్దని సభ్యులకు సూచించాల్సిందిగా కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. తాజా భేటీలో ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్ అధికారులు నర్సింగరావు, రామకృష్ణారావు, నవీన్ మిత్తల్, గణపతిరెడ్డి, స్మితాసబర్వాల్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications