వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలు, ఎంపీలతో కెసిఆర్ సమీక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని, అభివృద్ధి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటిన్నర నిధులు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికి శుక్రవారం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అనంతరం జిల్లాలవారీ విడివిడిగా మాట్లాడారు.

విద్యుత్ సమస్యపై సమావేశంలో చర్చకు వచ్చినపుడు, సోలార్ పంపుసెట్ల ఏర్పాటుపై ఒక కంపెనీ ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చిందని కెసిఆర్ తెలిపారు. వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు ఉపయోగిస్తే కేంద్రం 70 శాతం వరకూ సబ్సిడీ ఇస్తుంది. మొత్తం నిధులు తామే భరించి సోలార్ విద్యుత్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, పదేళ్ల తరువాత పనితీరు పరిశీలించి డబ్బులు చెల్లించవచ్చని ఈ ప్రతిపాదనతో ఒక కంపెనీ ముందుకొచ్చిందని కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని, అభివృద్ధి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటిన్నర నిధులు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహించారు.

కెసిఆర్

కెసిఆర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికి శుక్రవారం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అనంతరం జిల్లాలవారీ విడివిడిగా మాట్లాడారు.

కెసిఆర్

కెసిఆర్

విద్యుత్ సమస్యపై సమావేశంలో చర్చకు వచ్చినపుడు, సోలార్ పంపుసెట్ల ఏర్పాటుపై ఒక కంపెనీ ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చిందని కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు ఉపయోగిస్తే కేంద్రం 70 శాతం వరకూ సబ్సిడీ ఇస్తుంది. మొత్తం నిధులు తామే భరించి సోలార్ విద్యుత్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, పదేళ్ల తరువాత పనితీరు పరిశీలించి డబ్బులు చెల్లించవచ్చని ఈ ప్రతిపాదనతో ఒక కంపెనీ ముందుకొచ్చిందని కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ఆ కంపెనీతో ప్రాథమికంగా చర్చలు జరిగాయని, ప్రతిపాదనపై పరిశీలన చేయాలని అధికారులకు సూచించినట్టు కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రతిపాదన బాగుందని, ఉపయుక్తమని తేలితే తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే 300 కోట్లు వెచ్చించామని, ఆ నిధులు సోలార్ విద్యుత్‌కు వెచ్చిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణలో దాదాపు 20 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, వీటన్నిటినీ సోలార్ విద్యుత్‌తో పని చేసే పంపుసెట్లుగా మార్చేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చినట్టు కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం కింద ఏటా కోటిన్నర కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకానికి ఏటా 50 లక్షల రూపాయలు చెల్లించారు.

ఆ కంపెనీతో ప్రాథమికంగా చర్చలు జరిగాయని, ప్రతిపాదనపై పరిశీలన చేయాలని అధికారులకు సూచించినట్టు కెసిఆర్ తెలిపారు. ప్రతిపాదన బాగుందని, ఉపయుక్తమని తేలితే తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని కెసిఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే 300 కోట్లు వెచ్చించామని, ఆ నిధులు సోలార్ విద్యుత్‌కు వెచ్చిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, వీటన్నిటినీ సోలార్ విద్యుత్‌తో పని చేసే పంపుసెట్లుగా మార్చేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చినట్టు కెసిఆర్ తెలిపారు.

విద్యుత్ అంశమే తెలంగాణకు తీవ్రమైన సమస్యగా మారిందని, మరో పది రోజుల్లో పంట చేతికొచ్చినా వచ్చే ఏడాది కూడా సమస్య ఇదేవిధంగా ఉంటుందని కెసిఆర్ తెలిపారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ వచ్చేసరికి మరో రెండేళ్ల సమయం పడుతుందని, సోలార్ విద్యుత్ వల్ల సమస్య పరిష్కారమైతే మంచిదేనన్నారు.

ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం కింద ఏటా కోటిన్నర కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకానికి ఏటా 50 లక్షల రూపాయలు చెల్లించారు. తరువాత పథకాన్ని తొలగించారు. తిరిగి కోటి రూపాయలకు పెంచారు. ఇప్పుడు దాన్ని కోటిన్నరకు పెంచాలని నిర్ణయించినట్టు కెసిఆర్ తెలిపారు. వచ్చే ఏడాది రెండు కోట్ల వరకూ పెంచనున్నట్టు చెప్పారు. నియోజక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేదే కీలక పాత్ర. అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే జరగాలని ముఖ్యమంత్రి అన్నారు.

తెరాస ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కీలక భూమిక పోషిస్తారన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అలా సమన్వయం కోసం కృషి చేయాలని కెసిఆర్ సూచించారు. అధికారులు సరిగా పని చేస్తే సరే, లేదూ అభివృద్ధికి సహకరించకుంటే బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పనిచేయని అధికారులు ఎక్కడైనా ఉంటే వారి బదిలీకి వివరాలు అందించాలని సిఎం సూచించారు.

English summary
Telangana Rashtra Samithi executive meeting held at Telangana Bhavan, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X