కెసిఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించాడు

Subscribe to Oneindia Telugu

వరంగల్ :;ప్రాణాలను ఫణంగా పెట్టి కెసిఆర్ తెలంగాణను సాధించి పెట్టాడని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎంఏల్ఏ వినయ్ భాస్కర్ చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఆమరణ దీక్షకు పూనుకొన్నదినోత్సవాన్ని మంగళవారం నాడు వరంగల్ లోని కాళోజీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎంఏల్ఏ వినయ్ భాస్కర్, కుడా చైర్మెన్ మర్రి యాధవరెడ్డి, పలువురు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దీక్షదివస్ లో పాల్గొన్నారు.2009 లో కెసిఆర్ దీక్ష తలపెట్టిన పరిస్థితులను నెమరువేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఉద్యమం తలపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిందని వారు గుర్తు చేశారు.

కెసిఆర్ దీక్షకు కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఆంద్రప్రాంత నాయకులు తెలంగాణ రాకుండా ఏ రకంగా అడ్డుపడ్డారో వినయ్ భాస్కర్ ప్రస్తావించారు. అయినా మొక్కవోని దీక్షతో కెసిఆర్ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.

ఇవాళ్టి నుండి డిసెంబర్ 9వ, తేది వరకు పలు కార్యక్రమాలను చేపట్టునున్నట్టు ఆయన చెప్పారు. అమరుల కుటుంబాలకు సన్మానం, దళితవాడల్లో వైద్య శిబిరాలు, ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు, ఎన్ జి వోలకు సన్మానాలు , ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ అంశంపై పలు వ్యాసరచన , వకృత్వ పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పారు. డిసెంబర్ 9వ, తేదిన జయశంకర్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం వరకు బారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
trs conducted on tuesday dheeksha divas in warangal , trs chief struggle for seperate state years together said trs west mla vinaybahsker. nov 29 to dec9 conducting different programmes said vinaybhasker.
Please Wait while comments are loading...