కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!

దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. దీనిపై భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు నానా హడావిడి చేశారు. చెన్నై-లక్నో మధ్య ఐపీఎల్ లో క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ కేసీఆర్ ఇంటర్వ్యూనే అందరూ చూస్తారంటూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. కొన్ని ఊళ్లల్లో డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు హంగామా చేశారు. చివరకు ఆ డిబేట్ చూసినవారంతా ఒకటే మాట అన్నారు.

ఆ చెప్పే విషయాలేవో ప్రెస్ మీట్ పెట్టి చెబితే సరిపోయేదిగా.. టీవీ స్టూడియో వరకు రావడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ అయితే అన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం వచ్చేది.. కావల్సినంత ప్రచారం వచ్చేది. డిబేట్ లో జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే అందులో పాల్గొన్నవారు సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ అంతా రివర్స్ లో జరిగింది. కేసీఆర్ కు ఎదురుగా కూర్చున్న రజనీకాంత్ ఏమీ అడగలేదు. తాను చెప్పాలనుకున్నది కేసీఆర్ చెప్పారు. దానికి కంటిన్యుటి ఉండేలా రజనీ ప్రశ్నలు అడిగారు.

KCR said what he wanted to say

అడిగేంత అవకాశం కూడా కేసీఆర్ ఇవ్వలేదని డిబేట్ చూసినవారు చెబుతున్నారు. చూసినవారందరి అది ప్రసంగమని అర్థమైంది. కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇంటర్వ్యూ అన్నారుకానీ అది ఇంటర్వ్యూ కాదు.. అలా అని డిబేట్ కాదు.. అలా అని ప్రెస్ మీట్ కాదు.. అదే ఏమిటనేది కేసీఆర్ కే తెలియాలంటూ కామెంట్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏపీలో వైఎస్ జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు.. రేపు ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే కష్టమవుతుందని భావిస్తున్నారు. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు వీరిద్దరినీ ఏ విధంగా వేధించాననే విషయంలో కేసీఆర్ కు స్పష్టత ఉందని, తనను కూడా అలాగే వేధిస్తారేమో అనే అనుమానంలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. కేవలం కేసీఆర్ అపోహే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+