హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గుండాలి, చక్రం తిప్పుతాడట: చంద్రబాబుపై కేసీఆర్ ఘాటుగా, డీఎస్ పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Press Meet కేసీఆర్ ప్రెస్ మీట్

హైదరాబాద్: అసెంబ్లీ రద్దు ప్రకటన అనంతరం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 119 నియోజకవర్గాలకు గాను 105 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరేముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే

 సిగ్గుండాలి .. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపై ఆగ్రహం

సిగ్గుండాలి .. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపై ఆగ్రహం

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తుపై ప్రచారం సాగుతోంది. దీనిపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. పొద్దున లేస్తే చంద్రబాబు మాపై అబద్దాలు ఆడుతారని, కాంగ్రెస్ పార్టీని తిడతారని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తా.. సిగ్గుండాలి అని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈ కాంగ్రెస్ వాళ్లు ఆంధ్రా పార్టీని తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ ఆంధ్రా పార్టీకి గులాం కావొద్దన్నారు. తెలంగాణకు తెలంగాణ వాళ్లే శాసనకర్తలు కావాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్టీఆర్, చంద్రబాబుల కంటే మొనగాన్ని కావొచ్చన్నారు. ఎన్టీఆర్ కంటే మొగోన్ని కావొచ్చునని, చెన్నారెడ్డి కంటే మొగోన్ని అని నిర్ధారణ అయిందన్నారు. చెన్నారెడ్డి తెలంగాణ తేలేదని, తాను తెచ్చానని అన్నారు.

బాబు మోహన్‌కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్బాబు మోహన్‌కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్

 25 ఎంపీలను గెలిస్తే చక్రం తిప్పుతాడట

25 ఎంపీలను గెలిస్తే చక్రం తిప్పుతాడట

ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. తమది ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ అన్నారు. పక్క రాష్ట్రం అతనే నేను 25 స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని అన్నారని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ ఎద్దేవా చేశారు. తమ ఫ్రంట్ కచ్చితంగా బాగుంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలు అంతు లేకుండా మాట్లాడుతారని విమర్శించారు. రేపు సాయంత్రం వరకు తనకు ప్రధాని కావాలని ఉంటే అవుతానా అని ప్రశ్నించారు.

 ఉంటే ఉంటాడు.. వెళ్తే వెళ్తాడు

ఉంటే ఉంటాడు.. వెళ్తే వెళ్తాడు

డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకుడు అని కేసీఆర్ చెప్పారు. ఆయనకు పార్టీలో ఎంతో ఉన్నత స్థానం ఇచ్చామని చెప్పారు. ఆయన పార్టీలోకి వస్తానని చెబితే ఓకే చెప్పామని, అడ్వయిజర్‌గా చేశామని, రాజ్యసభ అడిగితే.. పెద్దాయన కదా అని ఇచ్చామని చెప్పారు. ఆయన పార్టీలో ఉంటే ఉంటడు.. వెళ్తే వెళ్తాడు.. ఆయన ఇష్టమని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి సవాల్

కాంగ్రెస్ పార్టీ హయాంలో బాంబు బ్లాస్ట్‌లు, మత ఘర్షణలు ఉండేవని కేసీఆర్ అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక అవేమీ లేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దామని అన్నారు.

English summary
Before 2014 many issues were in Telangana, like bomb blasts, electricity issues, communal violence but now we are free of all this. I am asking Congress leaders to come to ground and fight in the elections and public will give the reply, says K Chandrashekhar Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X