వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా దమ్ము - ధైర్యం మీరే : ఆగం చేస్తే నేనేం కావాలి - మోదీ.. ఏం పీక్కుంటావో పీక్కో: కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ - అమిత్ షా ను టార్గెట్ చేసారు. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దని సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు.. సచ్చినా పెట్టమని చెప్పానని వివరించారు. మునుగోడు టు జాతీయ స్థాయిలో కామ్రేడ్లతో ఐక్యత సాగాలన్నారు.

ప్రగతి శీల పార్టీలు కలిసి వస్తాయి

ప్రగతి శీల పార్టీలు కలిసి వస్తాయి


ఇంకా కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయని చెప్పారు. త్వరలో సీపీఎం కూడా కలిసి వస్తుందన్నారు. కేంద్రం బ్యాంకులు..రైళ్లు..కంపెనీలు అన్నీ అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో లక్ష మందికి రైతు బంధు వస్తోందని..1100 మందికి రైతు భీమా ఇచ్చామని వివరించారు. తెలంగాణ సమస్యల గురించి ఇక్కడి బీజేపీ నేతలు అడగరని ఎద్దేవా చేసారు. కృష్ణా జలాలపై మా వాటా తేల్చాకే మునుగోడులో అడుగుపెట్టు అమిత్ షా అంటూ కేసీఆర్ హెచ్చరించారు. రేపటి సభలో అమిత్ షా దీని పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. కేంద్ర మంత్రులు ఇంతింత పెన్షన్లు ఎందుకని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. తాను చెప్పే విషయాలపైన ప్రతీ ఇంటా చర్చ జరగాలని సూచించారు.ఇది ఉప ఎన్నిక కాదు - బతుకు తెరువు ఎన్నికగా కేసీఆర్ అబివర్ణించారు.

నా దమ్ము - ధైర్యం మీరే

నా దమ్ము - ధైర్యం మీరే


మీకు..మీటర్లు పెట్టే మోదీ కావాలా.. వద్దనే కేసీఆర్ కావాలా తేల్చుకోవాలని సీఎం సూచించారు. తన దమ్ము - ధైర్యం ప్రజలేనని పేర్కొన్నారు. మీరే ఆగం చేస్తారా.. నేను ఏం కావాలంటూ సెంటిమెంట్ పండించారు. ప్రధానితో కోట్లాడతున్నాం..మీ మద్దతు కావాలంటూ ప్రజలను కోరారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్ రాలేదన్నారు. బీజేపీకి ఓటు వేస్తే.. మీటరు వస్తుందంటూ కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆ పార్టీకి మూడు తోకలు ఉన్నాయని..షిండేలను తీసుకొస్తున్నామని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. ప్రధాని మోదీ ఏమనుకుంటున్నారు...ప్రజాస్వామ్య దేశమా.. బలుపా అని గర్జించారు. ఈడీ రైడ్స్ అంటున్నారని.. ఈడా బోడా రమ్మన్నాను అని వెల్లడించారు.

మోదీని గోకుతూనే ఉంటా

మోదీని గోకుతూనే ఉంటా


దొంగలు లంగలు భయపడతారు.. నిజాయితీగా ఉన్న వాళ్లు భయపడతారని ప్రశ్నించారు. ఏం పీక్కుంటావో పీక్కోమని చెప్పానని వెల్లడించారు. ప్రధాని ...నీవు గోకినా లేకున్నా.. నేను గోకుతూనే ఉంటానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది దేశం.. ఎవరి అయ్య సొత్తు కాదని పేర్కొన్నారు. తమిళనాడు.. బెంగాల్ లో ప్రభుత్వాలను పడగొడతామంటారని గుర్తు చేసారు. ప్రధాని మోదీని పడగొట్టటానికి వేరే వాళ్లు అక్కర్లేదని..
ప్రజాస్వామ్యం - అహంకారం మోదీకి శత్రువులు అవుతాయని హెచ్చరించారు. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు ఒక్క కేసీఆర్ కావాలన్నారు. మత పిచ్చి..కుల పిచ్చి మంచిదా అని నిలదీసారు. తెలంగాణ ఏమంటోంది ఈ ఎన్నికతో తెలియాలని వివరించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఉపయోగంలేదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అయితే, ఊహించిన విధంగా అభ్యర్ధి విషయం లో మాత్రం కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

English summary
CM KCR Appeal people in munugdou to support him to continue the schemes and pride of the state. KCR targets PM Modi and Shah in his public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X