కేసీఆర్ చేతికి కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, మారుతున్న లెక్కలు - కీలక మలుపు..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా కేసీఆర్ కొత్త రాజకీయ అస్త్రాలను సిద్దం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తామే తిరిగి అధికారంలో కొనసాగుతామని సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న వేళ గ్రేటర్ ఎన్నికలు పరీక్షగా మారుతున్నాయి. ఈ సమయంలోనే కేసీఆర్ కొత్త కార్యాచరణ రాజకీయం గా ఆసక్తి కరంగా మారుతోంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వేగం పెంచారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహాల కు పదును పెడుతున్నారు. ప్రజా సమస్యల పైన వరుస పోరాటాలకు సిద్దం అవుతున్నారు. అందు లో భాగంగా ప్రజా పోరాటాల పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. పోరాటాల కార్యాచరణ ఖరారు అయింది. అధికార పార్టీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు కేసీఆర్ కు అస్త్రంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న తరువాత.. ఇప్పుడు అధికార పార్టీలో మరి కొందరి పైన గురి పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ తో పాటుగా రంగారెడ్డి జిల్లా లోని సీనియర్ నేతలతో గులాబీ పార్టీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇదే సమయం లో గ్రేటర్ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలను కేసీఆర్ సిద్దం చేస్తున్నారు. గ్రేటర్ లో సమస్యల పైన ఆందోళనలకు కార్యాచరణ ఖరారు చేసారు.

 సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
kcr-sets-new-course-for-brs-plans-fresh-strategy-to-mount-pressure-on-revanth-government-here-the

వరుస నిరసనలు

ప్రధానంగా భూ కబ్జాలు, 22 ఎ వివాదం, హైడ్రా కూల్చివేతలు, తాజాగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ నిలబడింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు నిత్యం జనంలోనే ఉండాలని కేసీఆర్ నిర్దేశించారు. వెయ్యి రోజుల పాలనపై 'పోరుబాట' కు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ వైఫల్యాలపై అధికారికంగా ఛార్జ్‌షీట్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు "బాకీ కార్డ్స్" ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. వ్యవసాయం, రుణమాఫీ, ఉచిత విద్యుత్ సమస్యలపై రైతు సమావేశాలు, మహిళలు, యువత తోనూ వరుస సమావేశాలకు ముహూర్తాలు ఫిక్స్ చేసారు. వీటి ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో నెడుతూ.. ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్ అమలు చేస్తున్న వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+